YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పల్లె వెలుగు రంగులు మారుతున్నాయా

పల్లె వెలుగు రంగులు మారుతున్నాయా

విజయవాడ, డిసెంబర్ 9,
ఆంధ్రప్రదేశ్ లోని  ఏపీఎస్‌ఆర్‌టీసీ పల్లె వెలుగు బస్సు రంగు మార్చుకుంటుంది. రంగులు మార్చే నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నెల రోజుల క్రితం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పల్లె బస్సులు సరికొత్త రంగులను అడ్డుకోవడంతో మళ్ళీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కొన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లోని డిపోల్లో పల్లె వెలుగుబస్సులకు రంగులు మారాయి. ఇప్పటి వరకూ పల్లె వెలుగు బస్సులకు తెలుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు ఉండేవి. తాజాగా ఆకుపచ్చ, తెలుపు, నలుపుతో పాటు సన్నటి సిమెంట్ రంగు బస్సులు దర్శనమిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి వివిధ డిపోలో గ్యారేజీలో ఈ బస్సుల రంగులను మార్చడంలో అధికారులు నిమగ్నమయ్యారు. రంగుల కోసం ఒక్కొక్క బస్సుకు రూ.23 వేలు ఖర్చవుతుందని అధికారులు అంచనాగా చెబుతున్నారు.అయితే ఇలా పల్లెవెలుగు బస్సులు రంగులు మార్చడంపై ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. టీడీపీ జెండా రంగు పసుపు రంగులో ఉండటంతో.. ఇప్పుడు బస్సుల నుంచి పసుపును తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయంపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సి ప్రభుత్వం పసుపు రంగును చూసి భయపడుతోందని.. తాము పసుపు రంగుపై ఎలాంటి పేటెంట్‌ను క్లెయిమ్ చేయడం లేదని చెప్పారు. పసుపు రంగుని శుభప్రదంగా ఎప్పటినుంచో భావిస్తారు.  అందుకే ఈ రంగు బస్సులకు వేశారని తెలిపారు.ఇలా ఆంధ్రప్రదేశ్ లో బస్సులకు రంగులు మారడం.. దానిపై రాజకీయ దుమారం రేగడం ఇప్పుడేమి కొత్తకాదు. గతంలో కూడా ప్రభుత్వాలు మారినప్ప్పుడల్లా బస్సులు రంగులు మారుతుండేవి. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా తెలంగాణలోని ఆర్టీసీ లగ్జరీ సర్వీసుల రంగును గులాబీ రంగులోకి మార్చడం ప్రతిపక్షాల విమర్శలకు దారితీసింది.బస్సులు రంగులు మార్చె  విషయంపై  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. బస్సులను  పునరుద్ధరించే చర్యల్లో భాగంగా కలర్ మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. “పాత బస్సులు ఫిట్‌నెస్ పరీక్షకు వెళ్లినప్పుడు తాము కాలానుగుణంగా రంగులను మారుస్తాము. ప్రస్తుతం ఉన్న పల్లె  బస్సులు సీట్లు , బాడీతో సహా చాలా మరమ్మతులకు గురయ్యాయి. ఈ బస్సులకు ఫ్రెష్ లుక్ ఇవ్వడానికి,  రంగులు మారుస్తున్నామని .. దీంతో బస్సులకు సరికొత్త అందం వస్తుందని.. అంతేకాని మరో కారణం లేదు’’ అని కృష్ణమోహన్ అన్నారు. అయితే ఇప్పటికే కరోనాతో ఆదాయం భారీగా పడిపోయిన సమయంలో రంగులు మార్చడంతో డిపోపై ఆర్థిక భారం పడుతుందని పలువురు ఉద్యోగులు చర్చించుకోవడం విశేషం

Related Posts