YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైల్వే జోన్ పొయో...

రైల్వే జోన్ పొయో...

విశాఖపట్టణం, డిసెంబర్ 9,
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనే చేదు కబురు మరో మారు చెప్పింది. ప్రస్తుత వర్షాకాల సమావేశాల ఆరంభంలోనే తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో చావు కబురు చల్లగా చెప్పారు. అయినా హోదా తెస్తామని హామీ ఇచ్చిఅధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నోరు విప్పలేదు. వైసీపీ ఎంపీలు 22 మందిలో ఏ ఒక్కరూ ఇదేమిటని కేంద్రాన్ని ప్రశ్నించలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం అయితే చెప్పనే అక్కరలేదు, ఆయన ముందుగానే కాడి వదిలేశారు. కాదంటే, కాసింత గట్టిగా అడిగితే కేంద్రం ఎక్కడ కన్నేర్ర చేస్తుందో, సీబీఐ, ఈడీలు ఎక్కడ ఉచ్చు బిగిస్తాయో అనే భయంతో కావచ్చును కేంద్రం దయ మన ప్రాప్తం అనే వేదాంత ధోరణిలోకి వెళ్లి పోయారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. ముగిసిన హామీల హామీల జాబితాలలో విశాఖ రైల్వే జోన్ కూడా చేరింది. విశాఖ  రైల్వేజోన్ హామీకి కూడా  కేంద్రం తిలోదకాలు ఇచ్చింది. విశాఖ కేంద్రంగా  రైల్వేజోన్‌పై ఇంకా ఎవరికైనా ఆశలు ఉంటే ఆ ఆశల మీద కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ నీళ్ళు కుమ్మరించారు. ప్రత్యేక హోదా విషయంలో ఎలాగైతే 14 ఆర్థిక సంఘం సిఫార్సులను అడ్డు పెట్టుకుని,కేంద్రం ఇక దేశంలో ఏ రాష్ట్రానికి హోదా ఇచ్చేది లేదని తప్పించుకుందో, అదే విధంగా విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ దేశంలో ఇక కొత్త రైల్వే జోన్‌లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని తేల్చిచెప్పింది. బీజేపీ ఎంపీ అజయ్‌నిషాద్ ప్రశ్నకు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ జవాబిచ్చారు. దేశంలో ప్రస్తుతం 17 రైల్వేజోన్లు ఉన్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని అశ్వనీ వైష్ణవ్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు.. మరిన్ని జోన్‌లను ప్రకటించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.రైల్వేజోన్ సాధ్యాసాధ్యాలపై గతంలో ఓఎస్‌డీని కేంద్రం నియమించింది. రైల్వేజోన్‌పై కేంద్రానికి ఓఎస్‌డీ నివేదిక ఇచ్చింది. అయితే దీనిపై ఎటూ కేంద్రం తేల్చలేదు.మరో వంక ఆత్మ రక్షణలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గానీ,రాష్ట్ర ప్రభుత్వం గానీ, పార్లమెంట్ సభ్యులు గానీ కేంద్రం పై వత్తిడి చేయలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం అధిఅక్రంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయినా ఇంత వరకు  కేంద్రం వద్ద రైల్వే జోన్ ప్రస్తవన చేయలేదని,  అందుకే అందుకే కేంద్రం గత తెలుగు దేశం ప్రభుత్వం చేసిన అభ్యర్ధనలను కూడా అటకెక్కించిందని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు.ఇక ఏపీలో రైల్వేజోన్ అయ్యే పని కాదని కూడా రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం స్పందించని కారణంగానే విశాఖ రైల్వేజోన్‌ను కేంద్రం పక్కన పెట్టిందని రైల్వేశాఖ అధికారులు విమర్శిస్తున్నారు.

Related Posts