YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆ నాలుగు జిల్లాల్లే...

ఆ నాలుగు జిల్లాల్లే...

అనంతపురం, డిసెంబర్  9,
గంట‌కు 10 కోట్లు.. రోజుకు 84 కోట్లు.. వారానికి 585 కోట్లు.. నెలకు 2,500 కోట్లు.. ఏడాదికి 30,535 కోట్లు.. త‌గ్గేదే లే. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్టణం... ఈ నాలుగు జిల్లాల్లో మద్యం విక్రయాలు దుమ్మురేపుతున్నాయి. మ‌ద్యంపై గతేడాదికంటే 10వేల కోట్లు అద‌న‌పు రాబ‌డి రావాల్సిందే. పేరుకే దశలవారీ మద్య నిషేధం.. అమ్మ‌కాలు మాత్రం త‌గ్గేదే లే. తాగినంతా తాగించు.. తాగ‌కుంటే టార్గెట్లు పెట్టి మ‌రీ తాగించు. క‌లెక్ష‌న్లు త‌గ్గేదే లే. జ‌గ‌న్ స‌ర్కారు మ‌ద్యం పాల‌సీ ఇది. ఎక్సైజ్ అధికారుల‌కు ప్ర‌భుత్వం విధించిన టార్గెట్లు ఇవి. మద్యంపై వైసీపీ సర్కారు అధికారుల‌కు కొత్త టార్గెట్లు పెట్టింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.20,895 కోట్ల విలువైన మద్యం ఏపీలో అమ్ముడవగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.30,535 కోట్ల సరుకు అమ్మాల‌ని ఆదేశించింది. గతేడాదికంటే 10వేల కోట్ల విలువైన మద్యం అదనంగా సేల్ చేయాల‌ని టార్గెట్ పెట్టింది. మద్య నిషేధం అని చెప్పిన జగన్‌ ప్రభుత్వం.. మద్యం అమ్మకాల్లో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా 18వేల కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది 25వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. అమ్మకాల విలువ ఆధారంగా మద్యం షాపులను ఏ, బీ, సీ కేట‌గిరీలుగా ప్రభుత్వం వర్గీకరించింది. అమ్మకాలు ఎక్కువగా ఉంటే ఏ, మధ్యస్తంగా ఉంటే బీ, తక్కువగా ఉంటే సీ కేటగిరీగా విభ‌జించింది. రాష్ట్రంలోని షాపులన్నీ వీలైనంత త్వరగా ఏ-కేటగిరీలోకి వచ్చేయాలని ఒత్తిడి పెంచుతోంది. వారం వారం స‌మీక్ష నిర్వ‌హిస్తోంది. ఏపీలో అన్ని మ‌ద్యం షాపులు క‌లిపి.. నవంబరు 14 నుంచి 20 వరకు 419కోట్లు.. 21 నుంచి 27 వరకు 440 కోట్లు.. నవంబరు 28 నుంచి డిసెంబరు 4 వరకు 441 కోట్ల అమ్మకాలు జరిగినట్టు లెక్కలు తీసింది. అంటే, రోజుకు సగటున 63 కోట్ల విలువైన మద్యం అమ్ముడ‌వుతోంది. ఆ కోటా 84కోట్లకు పెంచాలని స‌ర్కారు ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టి మ‌రీ స‌రుకు అమ్మిస్తోంది.గత ప్రభుత్వంలో 4,380 షాపులుంటే వైసీపీ ప్రభుత్వం దశలవారీగా వాటిని 2,934కు తగ్గించింది. పనివేళలు కుదించింది. బెల్టు షాపులు రద్దు చేసింది. ప‌క్క రాష్ట్రాల నుంచి మ‌ద్యం స‌ర‌ఫ‌రా అడ్డుకుంటోంది. ఇన్ని చర్యలు తీసుకుని.. అమ్మకాలు మాత్రం పెంచుతోంది. షాపులు త‌గ్గించి.. సేల్స్ పెంచేసింది. ప్ర‌భుత్వ విధానం వ‌ల్ల ఒక్క‌రంటే ఒక్క‌ర‌న్నా.. తాగుడు త‌గ్గించారా? అంటే డౌటే. ఇలా అయితే ఇక మ‌ద్యపాన నిషేధం ఎలా సాధ్య‌మ‌వుతుంది? జ‌గ‌న్ స‌ర్కారు చెప్పేదొక‌టి.. చేస్తున్న‌దొక‌టి.. అని తేలిపోతోంద‌ని అంతా మండిప‌డుతున్నారు.

Related Posts