తాగు నీటి సమస్య ఉన్న గ్రామాల సర్పంచ్‌లు ఫోన్ కొడితే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గ్రామాల్లో నీటి ఎద్దడి పై, లోకేష్ గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించి, ఈ నిర్ణయం తీసుకున్నారు.మీ గ్రామంలో త్రాగునీటి సమస్య ఉన్నట్లయితే, ఆ ఊరి సర్పంచ్ ద్వారా, 18004251899 నెంబర్ కి కాల్ చేసి తెలియచెయ్యమని చెప్పారు. ఫోన్ చేసిన నాలుగు గంటల్లోనే గ్రామానికి మంచి నీటి ట్యాంకర్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసారు.అలాగే కృష్ణా జిల్లా యంత్రాంగం కూడా, కలెక్టర్ ఆఫీస్ లో ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేశారు. కృష్ణా జిల్లా పరిధిలో త్రాగు నీటి సమస్య పరిష్కారం కోసం, 0866-2474700, 2474701, 2474801, 2474803, 2474804, 2474806 నంబర్లకు ఫోన్ చెయ్యమని కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రకటించారు.రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్విట్టర్ ద్వారా తనకు సమస్యలు ఉంటే తెలియచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కోరారు. సమస్యలు ఉన్నవారు లోకేష్ ట్విట్టర్ ఎకౌంటు లో, ట్వీట్ చేసిన వెంటనే, లోకేష్ టీం, ఆ సమస్య గురించి మరిన్ని వివరాలు ఫోన్ ద్వారా అడిగి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఎక్కువగా రోడ్డులు గురించి, త్రాగునీటి సమస్య గురిచి, లోకేష్ కి ట్వీట్ చేస్తున్నారు.