ఒంగోలు
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ కారు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం గొబ్బూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోగా.. మృతుని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా… అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే.. అక్కడే ఉన్న స్థానికులు అతని భార్యను ఆస్పత్రి కి తరలించారు. ఇక ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు.