న్యూఢిల్లీ, డిసెంబర్ 9,
చాపర్ ప్రమాద మృతులకు పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం తెలిపాయి. రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ ఉభయసభల్లో గురువారం ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశించినట్లుగా తెలిపారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై రక్షణ మంత్రి రాజ్‌నాత్ సింగ్ ప్రకటన చేశారు. రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సూలూరు బేస్ క్యాంప్ నుంచి 11 గంటల 48 నిమిషాలకు టేకాఫ్ అయింది.12 గంటల 15 నిమిషాలకు వెల్లింగ్టన్‌లో ల్యాండ్ కావాల్సింది. కానీ 12గంటల 08 నిమిషాల తర్వాత రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.. ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. కాసేపట్లో వెల్లింగ్టన్ చేరుకుంటారనగా ప్రమాదం జరిగిందన్నారు. ఎయిర్ మార్షల్ మన్వేంద్రసింగ్ నేతృత్వంలో ఇప్పటికే విచారణ మొదలైందని తెలిపారు రాజ్‌నాథ్ సింగ్.వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారు. వరుణ్‌సింగ్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.. మరో 48 గంటలు గడిస్తే తప్ప వరుణ్‌సింగ్ ఆరోగ్యంపై ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో విశేష సేలందించారు వరుణ్ సింగ్. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో డైరెక్టింగ్ స్టాఫ్‌గా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న శౌర్య చక్ర అవార్డును అందుకున్నారు. గతేడాది అక్టోబరు 12న ఆయన నడుపుతున్న యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు.. వైఫల్యాన్ని సరిగ్గా గుర్తించారు.
వరుణ్ సింగ్ ను కాపాడుకోవాలి :
ఒకే ఒక్కడు..! అవును. కున్నూరు చాపర్ ప్రమాదంలో ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నది ఒకే ఒక్కడు. అతడే గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. మృత్యువుతో పోరాడుతున్నారు. వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారు. వరుణ్‌సింగ్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.. మరో 48 గంటలు గడిస్తే తప్ప వరుణ్‌సింగ్ ఆరోగ్యంపై ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో విశేష సేలందించారు వరుణ్ సింగ్. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో డైరెక్టింగ్ స్టాఫ్‌గా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న శౌర్య చక్ర అవార్డును అందుకున్నారు. గతేడాది అక్టోబరు 12న ఆయన నడుపుతున్న యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు.. వైఫల్యాన్ని సరిగ్గా గుర్తించారు.ల్యాండింగ్ కోసం తక్కువ ఎత్తుకు విమానం దింపుతుండగా.. ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ పూర్తిగా విఫలం అయింది. నియంత్రణ కోల్పోయింది. అప్పుడు ధైర్య సాహసాలు ప్రదర్శించిన వరుణ్‌సింగ్ ఫ్లైట్‌ను చాకచక్యంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా దింపారు.2020 అక్టోబర్ 12న తేజస్ యుద్ధవిమానాన్ని పరీక్షించారు వరుణ్ సింగ్. అప్పుడు ఆయన వింగ్ కమాండర్‌గా ఉన్నారు. విమానం 10వేల అడుగుల ఎత్తులో ఉండగా పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. జనరల్‌గా అలాంటి సిట్యుయేషన్‌లో ఏ ఫైలట్ అయినా విమానాన్ని వదిలేసి పారాచ్యూట్‌తో దూకేస్తారు.కానీ వరుణ్ సింగ్ మాత్రం అలా చేయలేదు..తన ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిసినా రిస్క్ చేశారు. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. తేజాస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను సేఫ్ ల్యాండ్ చేసినందుకే ఆయనకు శౌర్యచక్ర అవార్డునిచ్చారు.
మంచి నీళ్లు ఇవ్వలేదు :
నిన్న మధ్యాహ్నం సీడిఎస్ బిపిన్ రావత్ ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ కూనూరు వద్ద కూలిపోయిన సంగతి తెలిసిందే. టీ ఎస్టేట్‌కు సమీపంలో కూలిపోవడంతో అందులో పనిచేస్తున్న కూలి శివ అనే వ్యక్తి వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. మంటల్లో కాలిపోతున్న ఓ వ్యక్తిని చూశానని, మంచినీళ్లు అడిగారని, అయితే, నీళ్లు ఇవ్వకుండా గుడ్డలో చుట్టి పైకి తీసుకెళ్లి ఆర్మీకి అప్పగించానని, మూడు గంటల తరువాత చనిపోయి ఆ వ్యక్తి బిపిన్ రావత్ అని, దేశానికి ఎంతో సేవచేసిన వ్యక్తికి తాను మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయామని కంటతడి పెట్టుకున్నారు.రాత్రంతా తనకు నిద్రపట్టలేదని ఆ ప్రత్యక్షసాక్షి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పారు. సల్లూరు ఎయిర్ బేస్ నుంచి వెల్లింగ్టన్ ఆర్మీ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య, మరో 11 మంది ఆర్మీ అధికారులు మృతి చెందారు.