YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ సర్కార్ మరో యూటర్న్... జీవో నంబర్ 59ను ప్రభుత్వం వెనక్కి

జగన్ సర్కార్ మరో యూటర్న్...    జీవో నంబర్ 59ను ప్రభుత్వం వెనక్కి

అమరావతి డిసెంబర్ 9
ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న జగన్ సర్కార్ ఇప్పుడు మరో యూటర్న్ తీసుకుంది. సంచలన అడుగులు వేసింది. మోడీ బాటలోనే జగన్ కూడా నిర్ణయాలు వెనక్కి తీసుకుంటుండడం విశేషంగా మారింది. రాష్ట్రంలో అనేక విషయాలపై వెనక్కి తగ్గుతున్న జగన్ సర్కార్ మరో వివాదాస్పద జీవోపై కూడా యూటర్న్ తీసుకుంది. గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ జారీ చేసిన జీవో నంబర్ 59ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గురువారం జీవో నెంబర్ 59పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే జీవోను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ గతంలో ఏపీ ప్రభుత్వం జీవోనంబర్ 59ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటీషన్లు దాఖలు చేశారు. పిటీషనర్ల తరుఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. గ్రామ కార్యదర్శులకు కానిస్టేబుళ్లుగా మార్చి వారికి పోలీస్ డ్రస్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.జీవోను ఉపసంహరించి వారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తోందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.దీంతో పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

Related Posts