YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దూకుడు పెంచిన వైసీపీ

దూకుడు పెంచిన  వైసీపీ

తిరుపతి, డిసెంబర్ 10,
మొన్న పంచాయతీలు.. నిన్న పరిషత్‌లు.. తర్వాత మున్సిపాలిటీలు.. ఇప్పుడు కుప్పంలో బాబు పీఠం కదల్చడమే టార్గెట్‌గా పెట్టుకున్నారట అధికారపార్టీ నేతలు. ఫార్టీ ఇయర్స్‌ సీనియర్‌ను ఢీకొట్టడానికి ఓ యువనేతను బరిలో దించుతారనే టాక్‌ చిత్తూరు జిల్లా వైసీపీలో ఓ రేంజ్‌లో ఉంది. ఇంతకీ వైసీపీ వ్యూహం ఏంటి? ఎవరిని పోటీకి పెట్టబోతోంది?కుప్పం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అన్ని ఎన్నికలు ముగిసినా కుప్పం ఇంకా వార్తల్లోనే ఉంటోంది. ఈసారి అధికారపార్టీ వైసీపీ కేంద్రంగా కీలమైన డెవలప్‌మెంట్ జిల్లా రాజకీయాల్లో చర్చకు కారణమైంది. పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు టీడీపీ కంచుకోటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్‌లో వైసీపీ జెండా ఎగరేశారు. అక్కడితో సరిపెట్టుకోకుండా మరింత దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారని టాక్.కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో 25 వార్డుల్లో 19చోట్ల గెలిచి సత్తాచాటి.. వచ్చే సార్వత్రిక ఎన్నికలే మా టార్గెట్ అని మాటల తూటాలు పేల్చారు మంత్రి పెద్దిరెడ్డి. 2024లో కుప్పం తమదేనని ప్రకటించారు. పాపం చంద్రబాబు అని సెటైర్లు వేశారు మంత్రి. అధికారంలో ఉండటంతో వైసీపీ కుప్పం లోకల్‌ ఎన్నికల్లో గెలిచిందని చంద్రబాబు అండ్‌ కో భావించినా.. వైసీపీ నేతలు మాత్రం పక్కా ప్లాన్‌ అమలు చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో కుప్పం బరిలో నిలిచే అభ్యర్ధి వేటను పంచాయతీ ఎన్నికల తర్వాత మొదలుపెట్టినా.. మున్సిపల్‌ ఫలితాల తర్వాత క్లారిటీకి వచ్చారట.గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చంద్రమౌళి అనారోగ్యంతో చనిపోవడంతో ఆ స్థానాన్ని ఆయన కుమారుడు భరత్‌కు అప్పగించారు. ఇప్పుడు భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి.. కుప్పం కొత్త సారథి కోసం సీరియస్‌గా దృష్టి పెట్టారట. ఆ కొత్త సారథి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచే ఉంటారనే చర్చ పార్టీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి మధ్య రాజకీయ సెగలు రేగుతున్నాయి. అలాంటిది ఏకంగా పెద్దిరెడ్డి కుటుంబం నుంచే చంద్రబాబుపై ఒకరు పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతుండటంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు కుమారుడైన సుధీర్‌రెడ్డి బరిలో ఉంటారని తెలుస్తోంది. సుధీర్‌రెడ్డి ప్రస్తుతం పుంగనూరు సదుం, సోమల మండలాల ఇంఛార్జ్‌గా ఉన్నారు.మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఇప్పటికే ఆయన కుమారుడు మిధున్‌రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. అలాగే పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరందరి శిక్షణలో సుధీర్‌రెడ్డి కుప్పంలో రాటుదేలుతారని అనుకుంటోంది పార్టీ కేడర్‌. త్వరలోనే సుధీర్‌రెడ్డిని కుప్పం వైసీపీ ఇంఛార్జ్‌గా ప్రకటించి స్పెషల్‌ ఆపరేషన్‌ స్టార్ట్‌ చేస్తారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీగా ఉన్న భరత్‌ అసెంబ్లీ ఎన్నికల నాటికి తన పదవికి రాజీనామా చేసి బరిలో దిగుతారనే వాదన కూడా ఉంది. ఒకవేళ అధిష్ఠానం భరత్‌వైపు మొగ్గు చూపితే.. సుధీర్‌రెడ్డి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ వర్గాలు దీనికీ సోషల్‌ మీడియాలో సమాధానాలు చెప్పేస్తున్నాయి. పీలేరు లేదా పలమనేరు నుంచి సుధీర్‌రెడ్డి బరిలో దిగొచ్చనే చర్చను తీసుకొస్తున్నారు. కుప్పంలో వైసీపీ ఆపరేషన్‌పై సంక్రాంతి నాటికి క్లారిటీ వస్తుందనే లెక్కల్లో ఉన్నాయి పార్టీ వర్గాలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts