YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొత్తగూడెం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

కొత్తగూడెం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

భద్రాద్రి కొత్తగూడెం
కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటింగ్ కొనసాగింది. జిల్లా కలెక్టర్ అనుదీప్ పోలింగ్ కేంద్రాన్ని విజిట్ చేసి, ఏర్పాట్లను పరిశీలించారు.ఐడెంటీ కార్డు లేకుంటే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించవద్దని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు గాను అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఎన్నికల కమీషన్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ భద్రత మధ్య వంద మీటర్ల బారికేడ్ చేశారు. కొత్తగూడెం రెవిన్యూ డివిజన్ పరిధిలోని 60 మంది కౌన్సిలర్లు, 14 మంది జడ్పీటీసీలు, 145 మంది ఎంపీటీసీలు, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం 221 మంది, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 84 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Related Posts