YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చెన్నమనేనికి షాకేనా

చెన్నమనేనికి షాకేనా

కరీంనగర్, డిసెంబర్ 10,
వేములవాడ నియోజకవర్గంలో ప్రత్యేక సమీకరణాలు చేపట్టే పనిలో టీఆర్‌ఎస్ అధిష్టానం నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నమనేని రమేష్ బాబుకు ప్రత్యామ్నాయ నాయకున్ని ఎంపిక చేసుకుని రానున్న ఎన్నికల నాటికీ సిద్ధం చేసే పనిలో పడినట్టు అర్థం అవుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చల్మెడ లక్ష్మీనరసింహరావును పార్టీలో చేర్పించుకుంటున్నట్టుగా సమాచారం.సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కొంప ముంచాయా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటి వరకూ ఆయనకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేసిన వారు అంతగా లేరనే చెప్పాలి. స్థానికంగా ఆయనపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి పూర్తి స్థాయిలో తీసుకెళ్లలేకపోయారు స్థానిక నాయకులు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చందుర్తి మండలం సనుగుల ఎంపీటీసీ సభ్యుడు మాదాసు వేణు నామినేషన్ వేయడం ఆయనకు విజయ్ కుమార్, మహేష్‌లు నామినేషన్ వేయడంతో అధిష్టానం వారితో చర్చలు జరపాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో వారు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయినప్పుడు వేములవాడలో నెలకొన్న పరిణామాలను వివరించినట్టుగా సమాచారం. వీరిలో వేములవాడ కౌన్సిలర్లు విజయ్, మహేష్‌లు ఒకప్పుడు చెన్నమనేనికి ప్రియ శిష్యులుగా ఉన్న వారే. అయితే వారే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టడం గమనార్హం. కేటీఆర్‌తో భేటి అయినప్పుడు వేములవాడలో నెలకొన్న వైఫల్యాలు, పార్టీ కేడర్‌లో నెలకొన్న నిరాశ, నిస్పృహలను కూడా వివరంగా చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ కేడర్‌పై వివక్ష చూపుతుండడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకున్నట్టు తెలుస్తోంది. వేములవాడ నాయకులు చెప్పిన వివరాలను అసాంతం విన్న కేటీఆర్ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకునే పనిలో నిమగ్నం అయినట్టు తెలుస్తోంది.కరీంనగర్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎమ్మెల్సీగా పోటీ చేసిన చల్మెడ లక్ష్మీ నరసింహరావు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన ఆయన కరీంనగర్ సమీపంలో మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్నారు. లక్ష్మీ నరసింహరావు తండ్రి ఆనందరావు గతంలో ఓ సారి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న లక్ష్మీ నరసింహరావుకు వచ్చే ఎన్నికల్లో వేములవాడ నుండి పార్టీ టికెట్ ఇవ్వాలన్న యోచనతోనే పార్టీ అధిష్టానం అతన్ని టీఆర్‌ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వేములవాడ నియోజకవర్గానికి చెందిన వారే కావడం వల్ల లాభం చేకూరుతోందన్న అంచనాతోనే చల్మెడను పార్టీలో చేర్పించుకున్నట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగతంగా కూడా క్లీన్ చీట్ ఉన్న ఆయనకు వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే సానుకూల ఫలితాలు పొందవచ్చని కూడా భావిస్తున్నట్టు సమాచారం.

Related Posts