హైదరాబాద్, డిసెంబర్ 10,
కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య విమర్శలు, మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాజకీయ విమర్శలే కాదు, వ్యక్తిగత దూషణలూ సాగుతున్నాయి. రాజకీయాల్లో ఎవరి ప్రాబల్యం వారిది. ఎవరి ప్రాపకం వారిది. ఎత్తులు పై ఎత్తుల్లో విమర్శలు ఒక సాధనం. రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ అను పదే పదే ఇరుకున పెడుతున్నాడా..వారిని ఇరిటేట్ చేస్తున్నాడా... నిజమే అనిపిస్తుంది. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు చేసిందంతా డ్రామా అని, అది కేవలం కేసీఆర్, కేటీఆర్ లను రక్షించేందుకే అన్నది పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి ఆరోపణ. ఎంపీల ఆందోళనకు, అధినేతలను రక్షించడానికి లింకేంటీ అని అనుకోవచ్చు. అసలు విషయం అక్కడే ఉందంటున్నాడు రేవంత్ రెడ్డి. మంత్రి కేటీఆర్ పై ఏవో భూ లావాదేవీల ఆరోపణలు ఉన్నాయని, వాటిని నుంచి ఆయనను రక్షించేందుకు ఎం.పీల ఆందోళన డ్రామాలు అన్నది రేవంత్ వాదన. రేవంత్ విమర్శలకు మంత్రి కేటీఆర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదని, రేవంత్ కు మెదడులో చిప్ దొబ్బిందని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని కేటీఆర్ అన్నారు. రేవంత్ విమర్శలకు ఇంత ఘాటుగా కేటీఆర్ ఎందుకు స్పందించారు. ఎం.పీల ఆందోళనలకు, కేటీఆర్ ను రక్షించడానికి ఏంటీ సబంధం ఇదంతా ఏదో దాగి ఉందనే అనుమానాలకు తావిస్తుంది.