విశాఖపట్నం,
శుక్రవారం ఉదయం ప్రారంభమయిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలఇటీవల మృతి చెందిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్తో సహా మృతి చెందిన వారికి కౌన్సిల్ సంతాపం తెలిపింది. కౌన్సిల్ ఎజెండాలోని 26 అంశాలపై చర్చ జరుగుతున్న దశలో ఆస్దిపన్ను,ఓటిఎస్ విధానంపై ప్రతిపక్షాలు నిరసనకు దిగడంతో సమావేశంలో గందరగోళ పరిస్ధితులు తలెత్తాయి.అయితే కౌన్సిల్ లో జీరో అవర్ కోసం పట్టుపట్టిన ప్రతిపక్షాలకు అజెండాలో అంశాలు పూర్తి అయిన తర్వాత జీరో అవర్ ఇస్తానని మేయర్ హరివెంకటకుమారి చెయ్యడంతో మరింత ఆందోళన ఉదృతం చేశారు.ఈ క్రమంలో మేయర్ పోడియం వద్ద టిడిపితో సహా ప్రతిపక్షాలు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.ఒక దశలో వైసీపీ సభ్యుడు అల్లు శంకరరావు, టీడీపీ సభ్యుడు గంధం శ్రీనివాస్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడంతో గందరగోళ పరిస్ధితులు తలెత్తాయి.