YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వివాదం అవుతున్న గగోయ్ బుక్

వివాదం అవుతున్న గగోయ్ బుక్

న్యూఢిల్లీ, డిసెంబర్ 10,
మాజీ చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గగోయ్ తాజాగా రిలీజ్ చేసిన జ‌స్టిస్ ఫ‌ర్ ద జ‌డ్జి ఆటోబ‌యోగ్ర‌ఫీ వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. 2019, న‌వంబ‌ర్ 9న రామ‌జ‌న్మ‌భూమి-బాబ్రీ మ‌సీదు కేసులో తీర్పును వెలువ‌రించిన త‌ర్వాత తోటి జ‌డ్జీల‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్న‌ట్లు గ‌గోయ్ ఓ అంశాన్ని వెల్ల‌డించారు. అత్యంత వివాదాస్ప‌ద‌మైన రామ‌జ‌న్మ‌భూమి-బాబ్రీ మ‌సీదు కేసులో గ‌గోయ్ బృందం సంచ‌న‌ల తీర్పును వెలువ‌రించిన విష‌యం తెలిసిందే. అయితే తీర్పు వెలుబ‌డిన రాత్రి ఆ కేసు విచార‌ణ‌లో భాగ‌మైన ధ‌ర్మాస‌న స‌భ్యులకు మాజీ సీజే గ‌గోయ్ పార్టీ ఇచ్చారు. హోట‌ల్ తాజ్‌మాన్‌సింగ్‌లో డిన్న‌ర్‌కు వెళ్లారు. అక్క‌డ వాళ్లు వైన్ కూడా తీసుకున్నారు. అయితే ఈ అంశాన్ని గ‌గోయ్ త‌న స్వీయ‌చ‌రిత్ర పుస్త‌కంలో వెల్ల‌డించారు. అంతేకాదు.. అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన త‌ర్వాత కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఉన్న అశోక చ‌క్ర వ‌ద్ద గ్రూపు ఫోటో కూడా దిగారు. అయితే డిన్న‌ర్‌కు హోట‌ల్ తీసుకువెళ్లి అక్క‌డ చైనీస్ డిష్‌ల‌ను ఎంజాయ్ చేసిన‌ట్లు గ‌గోయ్ తెలిపారు.అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన ధ‌ర్మాస‌నంలో గ‌గోయ్‌తో పాటు మాజీ సీజే ఎస్ఏ బోబ్డే, జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, అశోక్ భూష‌ణ్‌, ఎస్ అబ్దుల్ న‌జీర్‌లు ఉన్నారు. హోట‌ల్‌లో ధ‌ర్మాస‌న స‌భ్యుల‌తో దిగిన ఫోటోను గ‌గోయ్ త‌న పుస్త‌కంలో ప్ర‌చురించారు. దానికి అయోధ్య తీర్పును సెల‌బ్రేట్ చేసుకుంటున్న‌ట్లు కామెంట్ చేశారు. అయోధ్య‌ తీర్పును సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అని గ‌గోయ్‌ను ఓ ఆంగ్ల మీడియా తాజాగా ప్ర‌శ్నించింది. దానికి గ‌గోయ్ కౌంటర్ ఇచ్చారు. ఫ్రెండ్స్‌తో క‌లిసి డిన్న‌ర్‌కు వెళ్తే.. ఫుడ్‌ను టేస్ట్ చేసేందుకు అని ఎందుకు అనుకోర‌న్నారు. ధర్మాస‌నంలో ఉన్న జ‌డ్జీలు చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని, తీర్పు త‌యారు చేసేందుకు నాలుగు నెలలు ప‌ట్టింద‌ని, మా బృందం అంతా చాలా క‌ష్ట‌ప‌డింద‌ని, అందుకే బ్రేక్ తీసుకోవాల‌నుకున్నామ‌ని గ‌గోయ్ అన్నారు

Related Posts