YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రావత్ వారసుడు ఎవరు

రావత్ వారసుడు ఎవరు

న్యూఢిల్లీ, డిసెంబర్ 10,
జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మృతితో తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఎవరనేది ఆసక్తికరంగా మారింది. సీడీఎస్గా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ అధిపతుల్లో ఒకరిని సీనియార్టీ ప్రాతిపదికన ఈ పదవికి ఎంపిక చేస్తారు. నేవీ, ఎయిర్ఫోర్స్ చీఫ్లు ఇటీవలే నియమితులు కావడంతో వారిలో సీనియర్ అయిన జనరల్ నరవాణెకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనరల్ బిపిన్ రావత్ పదవీవిరణ చేసిన తర్వాత ఆర్మీ చీఫ్గా నరవాణే నియమితులయ్యారు.ఆయన 2019 డిసెంబరు 31 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. గతవారమే నేవీ చీఫ్గా అడ్మిరల్ ఆర్.హరి కుమార్ బాధ్యతలు చేపట్టారు. వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి సెప్టెంబరు 30న నియమితులయ్యారు. ఈ దృష్ట్యా జనరల్ నరవాణెకే అవకాశాలు అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు. ఆయన సీడీఎస్ అయితే ఆర్మీ అధిపతిగా నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యోగేష్ కుమార్ జోషీ లేదా ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ చండీ ప్రసాద్ మహంతికిగానీ అవకాశాలు ఉన్నాయి.నేవీ, వాయుసేనల ప్రస్తుత చీఫ్ల కన్నా లెఫ్టినెంట్ జనరల్ జోషీయే సీనియర్ కావడం విశేషం. వచ్చే ఏడాది ఏప్రిల్తో నరవాణే పదవీకాలం ముగియనుంది. దీంతో 65 ఏళ్లు వచ్చే వరకూ ఆయన సీడీఎస్గా కొనసాగేందుకు అవకాశం ఉంది. ఇక, ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం ఘటన తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ బుధవారం అత్యవసర సమావేశమయ్యింది. ఈ సమావేశంలో తదుపరి సీడీఎస్ చీఫ్ నియమాకంపై కూడా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదుతూర్పు లడఖ్లో చైనాతో 19 నెలలుగా సైనిక ఘర్షణ కొనసాగుతోంది.. అప్పుడు, ఆర్మీ, నేవీ, ఐఏఎఫ్ థియేటర్ కమాండ్లలోకి చేర్చడంతోపాటు ప్రణాళిక, లాజిస్టిక్స్, శిక్షణ, సిద్ధాంత పరంగా చాలా అంశాలపై సందిగ్దత ఉంది.. జనరల్ రావత్ మొత్తం ప్రక్రియను ప్రారంభించారు.. కానీ ఆయన అకాల మరణంతో పని అసంపూర్తిగా మిగిలిపోయింది’ అని ఓ సీనియర్ సైనికాధికారి అన్నారు.ఓవైపు చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం, మరోవైపు యుద్ధం తీరు నానాటికీ మారుతుండటం వల్ల సీనియారిటీని మాత్రమే కాకుండా వినూత్న ఆలోచనలతో సైనిక దళాలను నడిపించగల సత్తా ఉన్నవారిని ఎంపిక చేయవలసి ఉంటుంది. ఓ వారంలోనే నూతన సీడీఎస్ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ పదవికి ఎంపిక చేయడానికి నిర్దిష్టమైన విధానం లేదు. సీనియర్లకు పదోన్నతి కల్పించడం ఈ విషయంలో జరగదు. వివిధ సందర్భాల్లో చూపిన చొరవ, అమలు చేసిన ఆలోచనలు, ప్రతిభాపాటవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పదవికి నియామకం జరుగుతుంది.

Related Posts