నందిగామ
కృష్ణాజిల్లా నందిగామ తహసిల్దార్ కార్యాలయంలో ఎసిబి తనిఖీలు కొనసాగాయి. డీఎస్పీలు శరత్ బాబు, శ్రీనివాస్, సిఐ లు శివ ప్రసాద్, కిషోర్, ఎస్ఐ నజీర్, ఏసీబీ సిబ్బంది ఈ తనిఖీలు జరిపారు. అక్కడి రికార్డు లు పరిశీలించారు. ఎమ్మార్వో చంద్రశేఖర్ నుండి వివరాలు సేకరిస్తున్న ఎసిబి అధికారులు, వీఆర్వోలను ఉద్యోగులను ప్రశ్నించారు. నందిగామ తాహసిల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వీఆర్వో దగ్గర నుండి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు రైతుల వద్ద నుండి ప్రతి పనికి లంచం అడుగుతున్నారని రైతుల నుండి ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలో దిగినట్లు సమాచారం.