YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

12న విశాఖ ఉక్కు కోసం జగన్ దీక్ష

12న విశాఖ ఉక్కు కోసం జగన్ దీక్ష

విశాఖపట్టణం, డిసెంబర్ 11,
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మళ్ళీ విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని చాటనున్నారు.  విశాఖలోని ఉక్కు పరిశ్రమని ప్రయివేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. జనసేనాని.. ఒక్కరోజు దీక్ష చేయనున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు సంఘీభావంగా…పవన్ కళ్యాణ్ ఈనెల 12వ తేదీన ఈ దీక్షను చేయనున్నారు.  మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పవన్ కళ్యాణ్ దీక్షను చేయనున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి, ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. తాను గతంలో విశాఖ ఉక్కు పై అఖిలపక్షాన్నీ ఏర్పాటు చేసి.. ఢిల్లీ తీసుకుని వెళ్లాలని చెప్పినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని అన్నారు. అందువల్లనే ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం తమ పార్టీ తరపున పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలను  ఢిల్లీ తెలుసుకుని వెళ్లి.. మన గళం వినిపించాలంటూ జనసేనాని డిమాండ్ చేశారు.కార్మికులు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు పరిశ్రమ ప్రయివేటీకరణను నిరసిస్తూ.. గత 300 రోజులుగా నిరవధికంగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే అన్ని రకాల చర్యలను కూడా ప్రారంభించేసింది. దీంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కార్మికులకు మద్దతుగా డిసెంబర్ 12న మంగళ గిరి లోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నిరాహార దీక్ష జరుగుతుందని జనసేన పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దీక్షా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.ఆంధ్రపదేశ్ లో పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతుఇస్తున్న సంగతి తెలిసిందే.. అయితే కేంద్ర లో అధికారంలో ఉన్న బీజేపీ..  విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రయివేట్ పరం చేయాలనీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర నిర్ణయానికి వ్యక్తిరేకంగా పవన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని మరోసారి తెరపైకి తీసుకుని రావడం.. ఉద్యోగుల ఆందోళలకు మద్దతు పలకడం.. ఇప్పుడు దీక్షను చేపట్టడం.. సర్వత్రా చర్చనీయాంశమయింది.

Related Posts