YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పేద రోగులకు ప్రభుత్వ బాసట... రికార్డు సంఖ్యలో సహాయ నిధి చెల్లింపులు -ఆబ్కారీ మంత్రి పద్మారావు గౌడ్ వెల్లడి

పేద రోగులకు ప్రభుత్వ బాసట... రికార్డు సంఖ్యలో సహాయ నిధి చెల్లింపులు -ఆబ్కారీ మంత్రి పద్మారావు గౌడ్ వెల్లడి

పేద ప్రజలకు వైద్య సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని, ఈ క్రమంలోనే సీతాఫల్ మందిలో కుట్టి వెల్లోడి  ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికను రూపొందించామని రాష్ట్ర మంత్రి టీ.పద్మారావు గౌడ్ తెలిపారు.  నామాలగుండు లోని తన కార్యాలయంలో 29 మంది రోగులకు రూ.14.50 లక్షల విలువ చెసే సీఎంఆర్ ఎఫ్  చెక్కులను, 7 మందికి రూ.10 లక్షల విలువచేసి  పాత్రలను (మొత్తం రూ.24 లక్షలు) మంత్రి పద్మారావు గౌడ్ గురువారం తన కార్యాలయంలో పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడచిన నాలుగేళ్ళ కాలంలో రెండు వేల మందికి పైగా రోగులకు రూ.23 కోట్లకు పైగా నిధులను ముఖ్య మంత్రి సహాయ నిధి  ద్వారా అందించి రికార్డు నెలకొల్పామని తెలిపారు.  సికింద్రాబాద్ నియోజకవర్గంలో పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారని, తమ అభ్యర్ధనకు వెన్వెంటనే స్పందించి పేద రోగులకు బాసటగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్కు, సీఎం కార్యాలయానికి మంత్రి పద్మారావు ఈ సందర్భంగా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. గత సమైక్య రాష్ట్రంలో సికింద్రాబాద్ పేదలు కనీసం సీఎంఆర్ ఎఫ్  వంటి ప్రయోజనాలకు కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్ముందు రోజుల్లో సికింద్రాబాద్ లో వైద్య సేవలను మరింతగా పెంచాలని భావిస్తున్నామని అందుకే తాజాగా మనికేశ్వరినగార్లో ప్రభుత్వ ఆసుపత్రిని నెలకొల్పేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో సంప్రదింపులు ప్రారంభించమని పద్మారావు పేర్కొన్నారు.కార్పోరేటర్లు  సామల హేమ, భార్గవి,  ఓఎస్డీ డాక్టర్ ఎస్ ఎం రాజేశ్వర్ రావు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts