YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తగ్గిపోతున్న పంచదార

తగ్గిపోతున్న పంచదార

విజయవాడ, డిసెంబర్ 11,
రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ షాపుల్లో చక్కెర అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలుగా కార్డులకు సరిపడ రేషన్‌ పంచదార సరఫరా చేయడంలో పౌరసరఫరాల సంస్థ విఫలమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,44,93,187 కార్డుల్లో అంత్యోదయ అన్న యోజన కార్డులు 7,79,168 ఉన్నాయి. వీటికి ఒక్కో కార్డుకు కేజీ చొప్పున, మిగిలిన 1,37,14,019 కార్డులకు అరకేజీ చొప్పున పంచదార ఇవ్వాలి. మొత్తం కార్డులన్నింటికీ పంచదార ఇవ్వాలంటే నెలకు నెలకు 8వేల మెట్రిక్‌ టన్నుల పంచదారను ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంటుంది. నెలకు 75.83లక్షల పంచదార ప్యాకెట్లు సరఫరా కావాల్సింది కేవల 66.91లక్షల ప్యాకెట్లు మాత్రమే సరఫరా అయ్యాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 9 లక్షల ప్యాకెట్లు సరఫరా కాలేదు. ఒక్క నెలలోనే ఈ విధంగా ఉంటే గడిచిన మూడు నెలల్లోనూ ఇదే తరహాలో ప్యాకెట్ల సరఫరా జరిగిందని డీలర్లు, ఎండియు డ్రైవర్లు చెబుతున్నారు. పంచదార అందని ప్రజలు తమను దోషులను చేసి నిందిస్తున్నారని, సమాధానం చెప్పుకోలేకపో తున్నామని డీలర్లు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత మూడు నెలల్లో సరఫరా అయిన పంచదారలో నాణ్యత ఏమాత్రం బాగోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.కార్డులకు సరిపడినంత పంచదార సరఫరా చేసేందుకు గోడోన్లలో సరిపడినంత నిల్వలు లేవని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్‌ నుండి సరిపడినంత పంచదార రావడంలేదు. రెండో విడత రేషన్‌ పంపిణీ తాలూకు కమిషన్లను ఇవ్వడం లేదు. డిసెంబర్‌లో అసలు పంచదార రాలేదు.రెండు నెలలుగా కార్డులన్నింటికీ సరిపడినంత పంచదార రావడంలేదు. అక్టోబర్‌లో సగం ఇచ్చారు. నవంబర్‌లో సగంలో సగం ఇచ్చారు. డిసెంబర్‌లో అసలు ఇవ్వలేదు. ప్రజల నుండి మాపై ఒత్తిడి పెరుగుతోంది. పంచదారను మేము అమ్మేసుకుంటున్నాం అని ఆరోపిస్తున్నారు. అధికారులు దీనిపై త్వరగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.

Related Posts