YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ గ్రామంలో పది రోజులు ఇతరులకు ప్రవేశం వుండదు

ఆ గ్రామంలో పది రోజులు ఇతరులకు ప్రవేశం వుండదు

కాకుళం
శ్రీకాకుళం జిల్లా ఆకాంక్షిస్తూ సీతంపేట మండలం జరడుకాలనీ గ్రామస్తులు గ్రామదేవత పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ గిరిజన గ్రామంలో ఆ పదిరోజులూ ఇతర గ్రామస్తులు గ్రామంలోకి రాకూడదని నిబంధన పెట్టారు.  మొదటి రోజున గ్రామ శివారున సందెమ్మ కు రెండు రోజున గ్రామ అమ్మవారుకు మూడో రోజున గ్రామపితృదేవతలకు మొక్కులు తీరుస్తారు. దీనిలో భాగంగా బుధవారం యజ్జరోడు, దీసరోడు, జన్నోడులు వారి భాషలో ప్రత్యేక మంత్రాలు చదువుతూ పూజలు చేస్తారు.
ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాలను కాపాడుకుంటూ పూజలు చేస్తున్నామని, అందరూ సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పక్క గ్రామమైన సుందరయ్య గూడ గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ప్రజల అందరూ అనుకొని  ముందే సామానులు తెచ్చుకొని, పక్క గ్రామాల వారికి సమాచారమిచ్చి, పండగ జరిగే రోజుల్లో ఎవరిని గ్రామానికి రాకూడదని చెబుతారు. ఎవరికైనా చిన్న చిన్న వ్యాధులకు సంబంధించి ముందుగానే మందులు సిద్దంగా ఉంచి, పెద్ద వ్యాదులకు డాక్టర్లని పిలిపించి బయట నుంచి మందులు అందిఅటామన్నారు. ఇలా చేయడం వల్ల గ్రామంలోకి ఎలాంటి దిష్టిగాని,భూతాలుగాని రాకుండా గ్రామాన్ని రక్షిస్తుందని నమ్మకమన్నారు. అలాగే ఈ పది  రోజులకు వివిధ మూలికలతో మందుల తయారుచేసి అమ్మవారి ముందు ఉంచి ఆ మందును వాడుకుంటామన్నారు. ఇలా చేయడం వల్ల గ్రామంలోకి ఎటువంటి వ్యాధులు రావని మా విశ్వాసం అంటూ గిరిజన గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు.

Related Posts