YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆరుగురు వేద పాఠశాల విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ దిగ్భ్రాంతి

ఆరుగురు వేద పాఠశాల విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ దిగ్భ్రాంతి

విజయవాడ,
గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న విషాద సంఘటన పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు అచ్చంపేట మండలంలోని మాదిపాడు సమీపంలో కృష్ణా నదిలో ఈతకు దిగి ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతి చెందటం విచారకరమన్నారు. మృతులు హర్షిత్ శుక్లా, శుభమ్ త్రివేది, అన్షుమన్ శుక్లా, శివ శర్మ, నితేష్కుమార్ దిక్షిత్గా గుర్తించగా వారి కుటుంబాలకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్నారుల భద్రత విషయంలో వివిధ సంస్థల యాజమాన్యాలు మరింత శ్రద్ధ తీసుకోవాలని  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

Related Posts