ఏలూరు
ఇంటి వారందరు బంధువు లింట్లో పెళ్ళికెళ్ళిన సమయం చూసుకుని దొంగలు నగదు ; నగలు దోచుకున్న సంఘటన సోమవారం తెల్లవారుజామున తడికలపూడిలో వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి లో జరిగింది. బాధితుడు అత్యం వెంకటేశ్వరరావు కుటుంబంతో ఆదివారం సాయంత్రం శుభకార్యానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. పెళ్లి నుండి సోమవారం ఉదయం తెల్లవారుజామున తడికలపూడి తిరిగి వచ్చారు. బీరువాలు పగలకొట్టి ఉండటం, డబ్బు నగలు పోయినట్లు బాధితులు గుర్తించారు. ఆగంతకులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. సిసి కెమెరాల హర్డ్ డిస్క్ తో సహ ఆరున్నర లక్షలు నగదు, బంగారం 70కాసులు చోరీకి గురైనట్లు బాధితులు వెల్లడించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. తడికలపూడి పోలీసులు క్లూస్ టీం , డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగారు.