YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు బాగుంటే... దేశం బాగుంటుంది.

రైతు బాగుంటే... దేశం బాగుంటుంది.

వ్యవసాయం బాగుంటేనే రైతు బాగుంటాడు.. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. కరీంనగర్‌లోని హుజురాబాద్‌లో ప్రతిష్టాత్మక రైతు బంధు పథకం ప్రారంభించారు.  పంటలకు కనీస మద్దతు ధర విషయంలో రైతులు, ప్రజా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. అన్నదాతల పరిస్థితి అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివిలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతన్నకు అండగా, అన్నదాతకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏడాదికి రూ.8000 అందించే సరికొత్త పథకం ‘రైతు బంధు’ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంఛనంగా ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో  సీఎం కేసీఆర్ తన స్వహస్తాలతో రైతులకు చెక్కులు అందజేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలకు చెక్కులిచ్చే కార్యక్రమం ఉద్యమంలా ప్రారంభమైంది.రైతు నోముల సంజీవ రెడ్డి మొట్టమొదటి చెక్కును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. మహిళా రైతు లక్ష్మి రెండో చెక్కును అందుకున్నారు. రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. రైతులు, వారి పంట భూమికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన ఈ ఆధునిక పట్టాదారు పాస్ బుక్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.రైతులను బుజ్జగించేలా కేంద్రం తియ్యటి పుల్లలు మాటలు చెప్పడం కాదు.. చిత్తశుద్ధి ఉంటే అన్ని పంటలకు మద్దత ధర ఇవ్వాలని సీఎం చంద్రశేఖరరావు డిమాండ్ చేశారు. ఇప్పుడున్న ధరలకు నాలుగో వంతు అదనంగా ఇవ్వాలని.... తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామన్నారు.  కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఎంపీలు నిలదీయాలి’ అని కేసీఆర్ అన్నారు.జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. కూలీలకు ఇచ్చే డబ్బును సగం కేంద్ర ప్రభుత్వం, సగం రైతు భరించేలా చేయాలని సూచించారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు సభకు హాజరైనవారంతా చేతులెత్తి ఈ డిమాండ్‌కు తమ మద్దతు ప్రకటించారు.. ఈ పథకం ద్వారా అన్నదాతలకు భరోసా లభిస్తుందని, ఇకపై రుణాల కోసం వడ్డీ వ్యాపారుల చెంతకు పరుగులు తీసే దుస్థితి ఉండదని పేర్కొంటున్నారు. రైతు పెట్టుబడి కోసం 12 వేల కోట్ల రూపాయలు కేటాయించాం. పెట్టుబడి సహాయం సద్వినియోగం చేసుకుని బంగారు పంటలు పండించాలని రైతులను కోరారు. వ్యవసాయం బాగుండాలంటే భూముండాలి..నీళ్లుండాలి..కరెంట్ ఉండాలి. భూ రికార్డులను ప్రక్షాళన చేసినం, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నం. ఈ సంవత్సరం నుంచి పంట పెట్టుబడి కూడా అందజేస్తున్నామని తెలిపారు. నేడు యావత్‌దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తుందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతంగా పూర్తి చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం వేదిక నుంచి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కూలీలకు ఇచ్చే డబ్బును సగం కేంద్ర ప్రభుత్వం భరించాలి..సగం రైతు భరించాలని కేంద్రానికి సూచించారు. కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని సీఎం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వాళ్ల మాటలు వింటే ఆగమవుతరు. ఆంధ్రా నాయకుల తొత్తులుగా ఉండి టీ కాంగ్రెస్ నేతలు వ్యవసాయాన్ని నాశనం చేశారని సీఎం విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరూపాయి కూడా ఇవ్వనంటే ఒక్క నేత కూడా కిక్కురుమనలేదు. ఆనాడు నోరు మూసుకున్న నాయకులు నేడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు వద్దు అంటున్నరో కాంగ్రెస్ నేతలు చెప్పాలని సీఎం ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లతో మూడు పంటలు పండించుకోబోతున్నం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీరందుతుందన్నారు.పాస్‌పుస్తకాల్లో పట్టాదారు పేరే ఉంటుంది కానీ అనుభవదారు పేరుండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో పాస్‌బుక్కులు తీసుకోవద్దన్నారు. కౌలు రైతులకు డబ్బు ఇవ్వమని సీఎం తెలిపారు. కోటి 40 లక్షల ఎకరాల పైచిలుకు భూమి సాగుకు అనుకూలంగా ఉందని తేలింది. చెక్కులు అందజేయడంలో ఇబ్బందులుంటే తమకు తెలియజేయాలని రైతులకు సీఎం సూచించారు.నిధులు దుర్వినియోగం కావొద్దు..డబ్బు రైతుకే అందాలి. రైతు సమన్వయ సమితి సభ్యులు చెక్కుల పంపిణీలో ఇబ్బందులను పరిష్కరించాలని సీఎం నిర్దేశించారు. టీఆర్‌ఎస్ పాలనలో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశాం. రైతులకు బీమా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం పునరుద్ఘాటించారు. జూన్ 2 నుంచి రైతులకు 5 లక్షల బీమా అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో ధనికులైన రైతులున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవాలే అని సీఎం ఆకాంక్షించారు. రెండు, మూడు నెలల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. కరీంనగర్ జిల్లాలో పసిడి పంటలు పండుతాయి. అగ్రకులాల్లోని పేదలకు కూడా తగిన స్కీములు ప్రకటిస్తమన్నారు. జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు పోను మిగతా 430 మండలాల్లో ఎమ్మార్వోలే రిజిస్ట్రేషన్ చేస్తారని సీఎం తెలిపారు. పోస్టులోనే రిజిస్ట్రేషన్ కాగితాలు, పాస్‌బుక్కులు ఇంటికొస్తయన్నారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేసినమని, కనివినీ ఎరగని రీతిలో భూరికార్డుల ప్రక్షాళన చేసినమని అన్నారు. 58 లక్షల మంది రైతులకు పాస్‌బుక్కులు, పంట పెట్టుబడి సాయం అందిస్తున్నం. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించామని సీఎం తెలిపారు. వ్యవసాయం పండగ అని తెలంగాణ చేసి చూపెట్టాలని రైతులకు సూచించారు. 60 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ మనల్ని గోసపెట్టింది. తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్‌ఎస్..తెలంగాణను వేధించిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం ఆరోపించారు.అంతకుముందు కరీంనగర్ చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ర్యాలీగా తరలివచ్చిన రైతులు ఘన స్వాగతం పలికారు. మహిళా రైతులు సైతం బతుకమ్మలు, కోలాటాలు తదితరల కళారూపాలతో తమ ప్రియతమ నేతకు సాదర స్వాగతం పలికారు. కళాకారులు డప్పు వాయిద్యాలు, నృత్యాలతో హోరెత్తించారు. ఈ కారణంగా కార్యక్రమం ముందుగా నిర్ణయించిన సమయం కంటే కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. రైతులకు ఎండ వేడి తగలకుండా అధికారులు రోడ్లపై స్ప్రింక్లర్లతో నీళ్లు చల్లే ఏర్పాట్లు చేశారు.దేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే ఇలాంటి అరుదైన పథకం మరొకటి లేదని అధికారులు, టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు

Related Posts