హైదరాబాద్
సోమవారం నాడు సనత్ నగర్ లో 2500 స్వచ్ఛ ఆటో లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ స్వచ్ మహా నగరం అని ప్రజలందరికీ గుర్తుండాలి మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి అన్న మాటలు సఫాయి అన్న నీకు సలాం అన్నా అంటూ మాటలు గుర్తు చేసారు. జిహెచ్ఎంసి సిబ్బందులు సేవలను మరువలేనివి అని అన్నారు. గతంలో నగరంలో 3,500 మెట్రిల్ టన్నుల చెత్త సేకరించేవారని చెప్పారు. ఇప్పుడు నగరంలో 6,500 టన్నుల చెత్త సేకరణ జరుగుతోందన్నారు. చెత్తను నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ దక్షిణ భారతంలోని మన హైదరాబాద్లో పెద్దదని తెలిపారు. రాబోయే రోజుల్లో మొత్తం చెత్తను రీ సైకిల్ చేసేలా ప్లాంట్ తీసుకోస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ, హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, సనత్ నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.