కడప
మైదుకూరు, బద్వేలు ప్రధాన రహదారి లోని జెట్ కొత్తపల్లి గ్రామ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి లారీని వెనుకనుంచి మరో వాహనం ఢీకొంది. అందులోని డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోయాడు. అర్తనాదాలతో మిన్నంటుతున్నాయి. రక్షించండి రక్షించండి అంటూ ప్రాధేయపడుతున్నాడు. గస్తీలో ఉన్న అటవీ శాఖ అధికారులు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యక్తిని రక్షించేందుకు బయటకు తీసేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. చేతకాలేదు. మరో వాహనం సహాయంతో ఎట్టకేలకు అందులోని డ్రైవర్ ను బయటికి తీశారు. 108 వాహనానికి స్వయంగా ఫోన్ చేశారు. 108 వాహనం వచ్చింది. తీవ్ర గాయాలతో ఉన్న డ్రైవర్ను అందులో ఎక్కించటంతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు . అతని వద్ద ఉన్న లక్ష రూపాయల నగదును కూడా వారికి అప్పగించారు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదంలో ఇరుక్కుపోయిన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన అటవీ అధికారులను సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.