YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జిల్లాల్లో రైతు బంధు చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు

జిల్లాల్లో రైతు బంధు చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు

రాష్ట్రవ్యాప్తంగా రైతు బంధు చెక్కుల పంపిణీ ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పట్టా పాసుబుక్‌లతో పాటు రైతుబంధు చెక్కులను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ రోజు రైతుల జీవితాల్లో మరుపురాని రోజు. భూ రికార్డుల ప్రక్షాళణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.వనపర్తి జిల్లాలోని పానగల్ మండలం అన్నారంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎన్నో పథకాలతో ఇప్పటికే దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో రైతుబంధు పథకాన్ని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతుబంధు పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. గత పాలకుల హయాంలో వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి వ్యవసాయం పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, జిల్లా సమన్వయసమితి కన్వీనర్ లకా్ష్మరెడ్డి పాల్గొన్నారు.సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోసపాడు గ్రామంలో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అద్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... వ్యవసాయం దండగ కాదు పండుగ అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించింది. గత పాలకులు రైతుల నడ్డి విరిచారు. వ్యవసాయం కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య, కలెక్టర్ సురేంద్ర మోహన్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ ప్రవల్లిక ప్రకాష్, పెన్ పహాడ్ జడ్పీటీసీ కోటేశ్వర రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Related Posts