సూర్యాపేట
బెల్ట్ షాప్ ఉన్న ప్రతి ఇంటికి వాహనాల్లో మద్యం సరఫరా చేస్తున్నారు. ఇది మద్దిరాల మండలంలోని వైన్ షాపుల విధానం. సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల మండలానికి గతంలో ఒక మద్యం షాప్ మాత్రమే ఉండేది. డిమాండ్ నేపథ్యంలో మరో కొత్త మద్యం షాపు మంజూరైనది. దీనితో రెండు మద్యం షాపుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఆదివారం మద్దిరాల మండలంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మద్యం దుకాణాలు వ్యాపార పోటీతత్వమో లేక బెల్టుషాపుల నిర్వాహకుల సౌకర్యం కోసమో గాని ఆదివారం రోజున మండలంలో వినూత్న రీతిలో మద్యం షాపుల నిర్వాహకులు వినూత్న రీతిలో విక్రయాలకు శ్రీకారం చుట్టారు. ఓ వాహనంలో మద్యంను తీసుకెళ్లి గ్రామాల్లో బెల్టు షాపులు ఉన్న ప్రతి ఇంటికీ తిరుగుతూ మద్యం కావాలా. ఎంత కావాలి. మద్యం మీ ఇంటి ముందుకే వచ్చింది తీసుకోండి అంటూ అవసరం ఉన్నవారికి ఆటోలో తీసుకువెళ్లిన మద్యం విక్రయించారు. ఇది చూసిన కొందరికి దిమ్మతిరగగా మరికొందరు ముక్కున వేలేసుకుని అవాక్కయ్యారు.