కడప డిసెంబర్ 13
ఇటీవల బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మైనార్టీల పైన మైనారిటీల మత గ్రంథాల పైన ఆర్ ఎస్ ఎస్ గుండాలు దాడులు చేయటం పవిత్ర గ్రంథాలను దగ్ధం చేయడం లాంటివి చేస్తున్నారని, ఇలాంటి వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. సోమవారం ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి షేక్. మక్బూల్ భాష పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటకలో ఆర్ ఎస్ ఎస్ గుండాలు మరోసారి రెచ్చిపోయారు అని ఆయన అన్నారు. క్రైస్తవ మత ప్రతినిధులు తమ ప్రచారం కార్యక్రమంలో భాగంగా కోలార్ పట్టణంలో ఇంటికి వెళుతుండగా, వారిని ని ఆర్ ఎస్ ఎస్ గుండాలు అడ్డగించి వారి వద్ద ఉన్న పుస్తకాలు లాక్కొని నిప్పు పెట్టడం దారుణమని ఆయన అన్నారు. గతంలో కూడా త్రిపురలో మసీదుల పైన దాడులు చేసి పవిత్ర ఖురాన్ దగ్ధం చేశారని ఇప్పటివరకు త్రిపుర రాష్ట్రం లో కూడా ఏ ఒక్కరిని అరెస్టు చేయలేదని ఆయన అన్నారు. ఇలాంటివారిని వెంటనే అరెస్టు చేయాల్సింది పోయి, కర్ణాటక ప్రభుత్వం రచ్చబండ పంచాయతీ చేసి వదిలేయటం వెనుక రహస్యం ఏమిటో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో మైనార్టీలపై పన్నెండు నెలల వ్యవధిలోనే 38 సార్లు దాడులు జరిగాయని ఇంతవరకు ఏ ఒక్కరికి అరెస్టు చేయకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. పైగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయొద్దని మతపరమైన పుస్తకాలు పంచవద్దని క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తులను పోలీసులు హెచ్చరించడం దారుణమన్నారు. ఇప్పటికే క్రిస్టియన్ల పైన 32 దాడులు జరిగాయని అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య దాడులు జరిగాయని ఆయన అన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పదే పదే మైనార్టీలపై, దళితులపై, క్రిస్టియన్ల పై, అనేక రకాల దాడులు జరుగుతున్నాయి, దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వాలు అరెస్టు చేయకుండా వెనుకబడిన మైనార్టీల నే అణగదొక్కడం కోసం, ఆ రాష్ట్రాలలో బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.
ఇప్పటికే బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఉత్తర ప్రదేశ్ లో అమల్లో ఉందని, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలలో కూడా అమలు చేస్తామని చెప్పటం వారి ఉద్దేశ్యం ఏమిటో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి, మైనార్టీల పైన జరుగుతున్న దాడులను వారి వారి మత పవిత్ర గ్రంథాలను దహనం చేస్తున్న ఆర్ఎస్ఎస్ గుండాలను వెంటనే అరెస్టు చేయించాలని ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ కేంద్రాన్ని కోరుకుంటున్నది.
ఈ కార్యక్రమంలో ఆప్ కి ఆవాజ్ జిల్లా నాయకులు మున్నా పాల్గొన్నారు.