న్యూ ఢిల్లీ
వారణాసీలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో శ్రీకాశీ విశ్వనాథ్ ధామ్ తొలి దశ నిర్మాణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్ట్ పనులకు 2018లో వారణాసి ఎంపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ఆలయం పూర్వ వైశాల్యం కేవలం 2,700 అడుగులు ఉండగా, ఈ ప్రాజెక్టులో భాగంగా 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించనుంది. పునర్నిర్మాణం సమయంలో 40 వరకూ దేవాలయాలు బైటపడటం వల్ల, వాటి సుందరీకరణకు అనుగుణంగా డిజైన్లను తిరిగి మార్చాల్సి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. రూ. 339 కోట్ల అంచనాతో చేప్పట్టిన ఈ ప్రాజెక్ట్ ఖర్చు క్రమేణా రూ. 400 కోట్లు చేరుకుంది. కాగా, ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు దర్శనాలు 3 రోజులపాటు దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. భక్తుల దర్శనం నిలివేయడం చరిత్రలో ఇది రెండవసారి మాత్రమే. గత ఏడాది కరోనా వ్యాప్తి సమయంలో మొదటిసారి భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. శ్రీకాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ కోసం మరోసారి మూసివేశారు.