YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు

హైదరాబాద్ డిసెంబర్ 13
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు. ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని మళ్లీ కలవాలంటే భయపడుతున్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు మాత్రం తమకు నచ్చని వారితో దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కానీ టీఆర్ఎస్ నుంచి భర్త్ చేయబడ్డ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో టాప్ 3 నాయకుడిగా కొనసాగుతున్న కే.కేశవరావు ఓ పెళ్లి వేడుకలో ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అంతేకాకుండా వీరిద్దరు సరదాగా మాట్లాడుకున్న దృశ్యాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ప్రత్యర్థి పార్టీల శుభకార్యాలకు దాదాపుగా వెళ్లరు. అయితే సంతాపం వ్యక్తం చేయడానికి మాత్రం వెళుతారు. రోశయ్య లాంటి అజాత శత్రువులు సీనియర్లు చనిపోయిన సందర్భంలో రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ స్పందిస్తుంటారు.అంతేకాకుండా కేసీఆర్ బాటలోనే ఇతర టీఆర్ఎస్ నాయకులు ప్రత్యర్థి పార్టీల నాయకులతో ఎక్కువగా చనువు ఉండకుండా జాగ్రత్తపడుతారు. ఒకవేళ కొన్ని కార్యక్రమాల్లో ఎదురైనా ముహభావంగా ఉంటారే తప్ప చనువుతో మాత్రం కనిపించారు.
కానీ టీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉంటూ.. పార్టీలో కేసీఆర్ కేటీఆర్ తరువాత ప్లేసులో ఉన్న కే.కేశవరావు తీరు అందరినీ ఆశ్యర్యం వేసింది. ఆయన ప్రత్యర్థి పార్టీకి అదీ టీఆర్ఎస్ పై పోరాటం చేస్తున్న ఈటల రాజేందర్ తో కలిసిమెలిసి ఓ పెళ్లివేడుకలో సరదా సంభాషణలు చేసుకోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీనాయకుడికి చెందిన ఈ వేడుకకు ఈ ఇద్దరు నాయకులు హాజరై మాట్లాడుకోవడమే కాకుండా ఆలింగనం కూడా చేసుకున్నారు. అంతేకాకుండా జోకులు సరదాలు వేసుకోవడం చూసి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నాలుగు రోజుల కిందట ఒక్కసారిగా ప్రగతిభవన్లో కనిపించారు. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారా..? అనే వార్తలు వచ్చాయి. దీంతో కోమటిరెడ్డి భేటీకి కారణం రాజకీయ కారణాలు కావని తన కుమారుడు సాంకేత్ రెడ్డి వివాహానికి కేసీఆర్ ను ఆహ్వానించేందుకు వెళ్లారని అసలు విషయం చెప్పారు.అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొడుకు వివాహం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ వివాహా కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఆహ్వానించినా రాలేదు. కానీ టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యుడిగా కొనసాగుతున్న కే.కేశవరావు మాత్రం హాజరయ్యారు. వాస్తవానికి కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకుడే. అందుకే పాత అనుబంధం ఉన్న కోమటిరెడ్డి కుమారుని వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది.
ఈ వివాహ వేడుకకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం హాజరయ్యారు. అయితే ఈటల కేకేలు ఒకరినొకరు చూడగానే పలకరించుకున్నారు. కాసేపు సరదాగా సంభాషించుకున్నారు.ఈటలను చూసిన కేకే ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. నవ్వుతూ పలకరించారు. కేకే తన మాస్క్ తో ఈటలను సరదాగా కొట్టడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక్క అక్కడున్నవారంత తమ మొబైల్లో ఈ దృశ్యాలను బంధించి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలు ఫొటోలు పోస్టు చేసిన కొద్ది సేపటికే వైరల్ కావడం విశేషం.మంత్రి పదవి నుంచి భర్తరప్ కాబడ్డ ఈటల రాజేందర్ తో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు దాదాపు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో ఈటల భూముల వ్యవహారంలో ప్రభుత్వం స్పీడు పెంచింది. ఆయన భూములు అక్రమమే అని ఇటీవల స్వయంగా కలెక్టరే తెలిపారు. దీంతో ఈటల సైతం టీఆర్ఎస్ పార్టీపై ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.ఇక బీజేపీ ఎంపీ మాత్రం బీజేపీతో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేప్యథ్యంలో కేకే ఈటల రాజేందర్ ఇలా కలుసుకోవడంపై రకరకాల చర్చలు మొదలు పెట్టారు.

Related Posts