YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఎమ్మెల్యే అండతో భూకబ్జాలు

ఎమ్మెల్యే అండతో భూకబ్జాలు

హైదరాబాద్, డిసెంబర్ 13
కోర్టు ఆదేశాలు దిక్కరిస్తూ పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని పఠాన్ చెరు మండలం పాటి ఘన్ పూర్ ఆనంద్ నగర్ కాలనీ ప్లాట్స్ ఒనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.ఆదివారం ఎన్ఎన్ఎస్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో  అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్ రెడ్డి, పి.శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ తాము ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకొంటూ జంగారెడ్డి, కళ్యాణ్ రెడ్డి, రాంనాయక్, స్వామి గౌడ్, సర్పంచ్ లక్ష్మణ్ రావు విచ్చలవిడిగా  భూకబ్జాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకుని కాలనీ ప్లాట్స్ ఒనర్స్ కు రక్షణ కల్పించాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.2004 లో చిన్న, మధ్య తరగతి కుటుంబాలు పాటి ఘన్ పూర్ సర్వే నెం. 184 నుండి  251 వరకు  92 ఎకరాల లే అవుట్ లో ప్లాట్లు చట్టబద్ధంగా కొనుగోలు చేశామని తెలిపారు. తమ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కట్టి లోన్ కూడా తీసుకున్నామని తెలిపారు. తాము ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా అడ్డుపడుతూ కబ్జాదారులు ఈ స్థలాన్ని రైతులు అమ్మారంటూ తమ ప్లాట్లను పొలాలుగా మార్చి ఫెన్సింగ్ వేసి తాము వెళితే సెక్యూరిటీతో గెంటి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తమకు అనుకూలంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సంగారెడ్డి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ దిక్కరిస్తు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులకు బిడిఎల్ సీఐ రామ్ రెడ్డి కొమ్ముకాస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కేటీఆర్ లకు పలుమార్లు వినతి పత్రాలు కూడా సమర్పించామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి బి.దేవ ప్రసాద్, ఉపాధ్యక్షుడు బి.విజయ్ కుమార్ బాధితులు మంజువాణి, పద్మ, కావేరీ, అరుణ పాల్గొన్నారు.

Related Posts