YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆర్ధిక దివాళా దిశగా రాష్ట్రం

ఆర్ధిక దివాళా దిశగా రాష్ట్రం

పిఠాపురం
హింస, అవినీతి, కక్ష సాధింపు చర్యలు తో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నాడు అని , రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే దిశగా ప్రయాణం సాగిస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. గొల్లప్రోలులో వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం ఆవరణలో పిఠాపురం నియోజకవర్గం  తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం గౌరవ సభ కార్యక్రమం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ,కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా దివంగత నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి యనమల రామకృష్ణుడు , చినరాజప్ప. వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి , ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన పై మాట్లాడారు. అనంతరం  తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సభను ఉద్దేశించి మాట్లాడారు. జ్యోతుల నవీన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేవరకూ ప్రతి తెలుగుదేశం కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి లేదని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం పిఠాపురం నియోజకవర్గం ప్రజల కోసం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎంతో   కష్టపడుతున్నాడు అని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి సుపరిపాలన రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఈ సందర్భంగా  తెలియజేశారు .ఈ కార్యక్రమం అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి యనమల రామకృష్ణుడును చినరాజప్ప ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి .పిల్లి సత్తిబాబు. యనమల శివరామకృష్ణ .భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..

Related Posts