హైదరాబాద్, డిసెంబర్ 13,
అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌ను ఈ రోజు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా జగన్‌కు నోటీసులు జారీ చేసింది. జగన్‌పై 11 ఛార్జిషీట్లు ఉన్నాయని, జగన్ బయట ఉంటే తన పదవిని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు అయితే వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేసి అన్ని ఛార్జిషీట్లపై విచారించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.