YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఊరట..

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఊరట..

విజయవాడ, డిసెంబర్ 13,
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఊరట కలిగింది. లక్ష్మీనారాయణకు ఏపీ హైకోర్టు.. సోమవారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష్మీనారాయణ ట్రైనింగ్‌ సెంటర్ల ద్వారా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని లక్ష్మీనారాయణ ఇంట్లో మూడు రోజుల క్రితం సోదాలు నిర్వహించారు. గతంలో చంద్రబాబు దగ్గర ఓఎస్డీగా పనిచేశారు లక్ష్మీనారాయణ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో యువతకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే ట్రైనింగ్ సెంటర్ల ద్వారా అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఆయన ఇంట్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.అయితే.. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో యువతకు ట్రైనింగ్ ఇస్తున్న లక్ష్మీనారాయణ.. ట్రైనింగ్ సెంటర్ల ద్వారా ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో సీఐడీ అధికారులు.. కేసు కూడా నమోదు చేశారు. అధికారులు లక్ష్మీనారాయణ అవినీతిని నిగ్గుతేల్చే పనిలో పడ్డారు. అయితే.. లక్ష్మీనారాయణ అధికారుల దాడులపై కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌ విచారించిన హైకోర్టు లక్ష్మీనారాయణకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ట్రైనింగ్‌ సెంటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారా? ఒకవేళ అవినీతి జరిగితే ఏ విధంగా జరిగింది ? ఇందులో ఇంకెవరి హస్తమైనా ఉందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సీఐడీ అధికారులు.

Related Posts