YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎన్టీఆర్ బయోపిక్ స్కిప్ట్ వర్క్ పూర్తి

ఎన్టీఆర్ బయోపిక్ స్కిప్ట్ వర్క్ పూర్తి

టాలీవుడ్‌లో తెర‌కెక్కిన మొద‌టి బ‌యోపిక్ మ‌హాన‌టి. సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బిగ్ హిట్ సాధించింది. అభిమానులు, క్రిటిక్స్‌, సెల‌బ్రిటీలు చిత్రంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మ‌హాన‌టి మంచి విజ‌యం సాధించ‌డంతో ఎన్టీఆర్ బ‌యోపిక్ పనులు వేగ‌వంతం చేశారు. దీనిని కూడా తెలుగు అభిమానులు మెచ్చేలా తెర‌కెక్కించేందుకు రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు . అయితే ఈ చిత్రాన్ని తేజ తెర‌కెక్కిస్తాడ‌ని ముందు నుండి ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికి చివ‌రి క్ష‌ణంలో ఆయ‌న డ్రాప్ కావ‌డంతో ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నే దానిపై సందిగ్ధం నెల‌కొంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ వార్త ఫిలింన‌గ‌ర్‌లో చక్క‌ర్లు కొడుతుంది. మూవీ చిత్రీక‌ర‌ణ ముందుగా 1980లో ఆంధ్రా పాలిటిక్స్ మార్చిన తిరుప‌తి బ‌హిరంగ స‌భ నుండి మొద‌లు కానుంద‌ట‌. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తుండ‌గా, ఇందులో 64 పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. బాల‌య్య హెలికాఫ్ట‌ర్ ఎంట్రీ సీన్స్ ఆడియన్స్ రోమాలు నిక్క‌పొడుచుకునేలా ఉంటుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ చిత్రం మ‌రొ కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. సాయికొర్ర‌పాటి, విష్ణు వ‌ర్ధ‌న్‌, బాల‌య్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

Related Posts