YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజోలులో జనసేనకు మద్దతుగా వైసీపీ

రాజోలులో జనసేనకు మద్దతుగా వైసీపీ

కాకినాడ, డిసెంబర్ 14,
నాడు ఓట్లు వేయించి గెలిపించిన పార్టీ కార్యకర్తలు నేడు ఈ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అంటున్నారు. పార్టీ మారిపోయానని చెప్పి రెండేళ్లుగా ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నారు. గెలిపించిన పార్టీ కార్యకర్తలు మాత్రం ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు పెట్టి మరీ ఆ ఎమ్మెల్యేను వెంటాడుతునే ఉన్నారట. అవకాశం వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తున్నారట. ఇదంతా అధికార పార్టీ నేతే వెనకుండి నడిపిస్తున్నారని తెలిసి.. సొంతపార్టీ వాళ్లే తలలు పట్టుకుంటున్నారటజిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను జనసేన కార్యకర్తలు వదిలి పెట్టడం లేదు. జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక.. తాను వైసీపీ ఎమ్మెల్యేనని ప్రకటించుకుని అధికారపార్టీ నేతగానే కొనసాగుతున్నారు. రాపాక తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనసేన కార్యకర్తలు ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జనసేన నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిపించామనే ఆనందాన్ని మిగల్చకుండా రాపాక వైసీపీలోకి వెళ్లడంపై గుర్రుగా ఉన్నారు. అప్పటి నుంచి ఎమ్మెల్యేను ఇరకాట పెట్టడమే ధ్యేయంగా కక్షతో పని చేస్తున్నారట.స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని జనసేన సత్తా చాటింది. ఇటీవల ఉపఎన్నిక జరిగిన మల్కిపురం మండలంలోని రెండు ఎంపీటీసీలను జనసేనే గెల్చుకుంది. గ్లాస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక ఫ్యాన్ గుర్తుకిందకు వెళ్లినా.. రాజోలులో జనసేన బలం తగ్గలేదని నిరూపించారు. ఎమ్మెల్యే రాపాకను ఇరకాటంలో పెట్టేలా బాణాలు వదులుతున్నారు. అవకాశం వస్తే ఆరోపణలు.. అనుచిత కామెంట్స్‌తో విరుచుకు పడుతున్నారు జనసైనికులుతాజాగా రాజోలు మండలం కాట్రేనిపాడులో ఎమ్మెల్యే రాపాక గో బ్యాక్ అంటూ జనసైనికులు ఫ్లెక్సీ పెట్టడం దుమారం రేపింది. మా ఓట్లుతో గెలిచి పార్టీకి.. మాకు ఎందుకు ద్రోహం చేశారంటూ కాట్రేనిపాడులో ఎమ్మెల్యేను నిలదీయాలనుకున్నారు. అయితే జనసేన కార్యకర్తలతో పోలీసుల చర్చలు జరపడంతో నిరసన కార్యక్రమాన్ని జనసేన శ్రేణులు విరమించుకున్నాయి. జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు పోలీసులు. రాపాకను జనసేన తరఫున గెలిపించేందుకు శ్రమించిన తమకు అన్యాయం జరిగిందని చెబుతూ.. శాంతియుత నిరసన చేపడితే పోలీసులు అడ్డుకోవడంపై పార్టీ కేడర్‌ అసహనం వ్యక్తం చేసిందట. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే తప్పించుకుంటున్నారని జనసైనికులు గుర్రుగా ఉన్నారు.ఇకపై రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కడికెళ్లినా చేదు అనుభవాలు ఎదురయ్యేలా కార్యక్రమాలు చేయాలని జనసేన కార్యకర్తలు కంకణం కట్టుకున్నారట. జనసైనికులను కట్టడి చేయడానికి ఎమ్మెల్యే రాపాక కేసులు పెట్టించడంతో విభేదాలు తారాస్థాయికి చేరినట్టు సమాచారం. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. జనసైనికులు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఓ వైసీపీ నేత అండదండలేనట. కోఆర్డినేటర్‌గా అన్‌ఫిట్‌ అని పదవి నుంచి తొలగించి.. ఆ నేతకు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు. అయినప్పటికీ ఆ నాయకుడికి రాజోలు కోఆర్డినేటర్‌ పదవిపై వ్యామోహం పోలేదట.రాపాకకు వైసీపీ పగ్గాలు పూర్తిగా అప్పగించడంతో జీర్ణించుకోలేక ఆ అధికారపార్టీ నేతే ఇదంతా నడిపిస్తున్నారని రాజోలులో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని రాపాక వర్గీయులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. వైసీపీ అభ్యర్థిగా రెండుసార్లు ఓడిన ఆ నేతే ఇప్పుడు జనసేనవైపు తొంగి చూస్తున్నారట. వైసీపీలో కొనసాగుతూనే జనసేన పార్టీకి బాటలు వేస్తున్నారట. ఇలా చేయడం వల్ల తన ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టడం ఒక్కటైతే రాబోయే రోజుల్లో పక్క పార్టీలో సీట్‌ రిజర్వ్‌ చేసుకోవడం ఇంకొటట. అందుకే సైలెంట్‌గా కానిచేస్తున్నట్టు టాక్‌. ఈ విషయం తెలిసి అధికారపార్టీ నేతలు తలపట్టుకుంటున్నారట. ఎమ్మెల్యే.. జనసేన నేతల మధ్య నెలకొన్న విభేదాలతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts