YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సిబిఐ అధికారులమంటూ ఇళ్ళు లూఠీ

సిబిఐ అధికారులమంటూ ఇళ్ళు లూఠీ

హైదరాబాద్
సిబిఐ అధికారులు పేరుతో ఇంట్లో దోపిడీ జరిగింది.  సోదాలు చేయాలంటూ దొంగలు ఇంటిని దొంగలు గుల్ల చేసారు. ఈ ఘటనలో కేజీ 35 తులాలు  బంగారం తో పాటు లక్ష 70వేల  నగదు చోరీ అయ్యాయి. గచ్చిబౌలి పీయస్ పరిది నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జయభేరి ఆరెంజ్ కౌంటీ లో ఉంటున్న భాగ్యలక్ష్మి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జయభేరి ఆరెంజ్ కౌంటి ప్లాట్ నెంబర్ 110 లో భాగ్యలక్ష్మి, సుబ్రమణ్యం దంపతులు వుంటున్నారు. సోమవారం  మద్యాహ్నం రెండు గంటల సమయం లో భాగ్యలక్ష్మి ఇంటికి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. సీబీఐ అధికారులమంటూ ఇంటి ఓనర్ భాగ్యలక్ష్మి ని పరిచయం చేసుకున్నారు. దాదాపు గంటన్నర వరకు ఇంట్లో ఉన్న దుండగులు,  లాకర్ కీస్ తీసుకుని కేజీ 35 తులాలు  బంగారం, లక్ష 70 వేల నగదు ఎత్తుకెళ్లారు. దుండగులు ఉపయోగించిన కారు నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts