YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఒంటేరు యాదవరెడ్డి ఘన విజయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఒంటేరు యాదవరెడ్డి ఘన విజయం

మెదక్
ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఒంటేరు యాదవ రెడ్డి 584 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు  ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ఈ ప్రక్రియలో మొత్తం మూడు రౌండ్లు ముగిసేసరికి టిఆర్ఎస్ అభ్యర్థి ఒంటేరు యాదవ రెడ్డి కి 762 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల జయప్రకాష్ రెడ్డి కి 238 ఓట్లు వచ్చాయి  కాగా స్వతంత్ర అభ్యర్థి మట్ట మల్లారెడ్డి కి 6  ఓట్లు రాగా 12 ఓట్లు చెల్లని ఓట్లు గా అధికారులు గుర్తించారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ దాదాపు రెండు గంటల్లోనే అంటే పది గంటల లోపే అధికారులు పూర్తిచేశారు  టిఆర్ఎస్ పార్టీ ఒంటేరు యాదవ రెడ్డి విజయం పట్ల టిఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజా సంక్షేమ పార్టీగా కెసిఆర్ పనితనాన్ని గుర్తించిన ఓటర్లు తనపై తెలంగాణ ప్రభుత్వం పై టిఆర్ఎస్ పార్టీపై నమ్మకం నుంచి తనను గెలిచినట్లుగా యాదవ రెడ్డి అన్నారు స్థానిక సంస్థల బలోపేతానికి తనవంతుగా కృషిచేసి కెసిఆర్ సలహాలు సూచనలతో పనిచేస్తూ స్థానిక సంస్థల బలోపేతానికి తనవంతు గా సహకరిస్తానని అని ఎమ్మెల్సీ అభ్యర్థి ఒంటేరు యాదవ రెడ్డి  అన్నారు తన గెలుపుకు కృషి చేసిన మంత్రి హరీష్ రావుకు ప్రత్యేకంగా ఆయన అభినందనలు తెలిపారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు తన గెలుపుకు కృషి చేశారని  వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు టిఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 777 ఓట్లు ఉండగా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి సతీమణి బరిలోకి దిగడంతో మొదట్లో టిఆర్ఎస్ శ్రేణులు కాస్త ఆందోళన చెందినప్పటికీ మంత్రి హరీష్ రావు యాదవ రెడ్డి  గెలుపు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని స్థానిక ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసి ఎన్నికల గెలుపు కోసం దాదాపు పది పదిహేను రోజుల నుండి అహర్నిశలు శ్రమించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వంటేరు యాదవ రెడ్డి విజయానికి కృషి చేశారు పార్టీ అభ్యర్థి ఒంటేరు యాదవ రెడ్డి విజయానికి కృషి చేశారని అని చెప్పవచ్చు

Related Posts