YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

శిల్పా కేసులో ట్విస్ట్

శిల్పా కేసులో ట్విస్ట్

హైదరాబాద్, డిసెంబర్ 15,
ఒకటి కాదు రెండు కాదు.. శిల్పాచౌదరిని మూడుసార్లు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కానీ ఏ సమాచారం రాబట్టారు.. ఎంత మేర మోసాలు గుర్తించారు.. అంటే నో ఆన్సర్. ఇన్ని రోజుల్లో పోలీసులు ఏం సాధించారు? ఎంత సొత్తు స్వాధీనం చేసుకున్నారు అంటే నో ఆన్సర్. ఆఖరికి ఆమె బ్యాంకు లాకర్లలో ఏదో ఉందని వెళ్లిన పోలీసులకు నిరాశే ఎదురైంది. శిల్పాచౌదరి దంపతులను కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంకుకు తీసుకెళ్లి, ఆమె లాకర్లపై ఆరా తీశారు నార్సింగి పోలీసులు. కేసుకు సంబంధించి కీలక ధ్రువపత్రాలతో పాటు నగదు, స్థిరాస్తుల వివరాలు బయటపడొచ్చని భావించారు. కానీ ఆ లాకర్లను చూసి అవాక్కయ్యారు. బ్యాంక్ లాకర్‌లో ఏమి గుర్తించలేక పోయారు పోలీసులు.ఎటువంటి నగదు, బంగారు ఆభరణాలు గుర్తించలేదు. ఓ సొసైటీకి సంబంధించిన డాకుమెంట్స్ మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. శిల్పాచౌదరిని తిరిగి ఎస్వోటి కార్యాలయానికి తరలించారు. ఇన్ని రోజుల ఇంటరాగేషన్‌లో కొండను తవ్వి ఎలుకను పట్టారనే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నలతో శిల్పను ఉక్కిరిబిక్కిరి చేయడం కాదు-పోలీసుల్నే శిల్ప ఆటాడుకుంటోందనేది టాక్‌. పైగా, తప్పుడు ఇన్ఫర్మేషన్‌తో పోలీసుల్ని శిల్ప తప్పుదారి పట్టిస్తోందనే రీసౌండ్ వస్తోంది. శిల్పపై మొత్తం ఏడు కేసులు నమోదైతే, మూడు కేసుల్లో మాత్రమే ఇప్పటివరకు కొంత క్లారిటీ వచ్చింది. మొత్తం రెండు వందల కోట్లు నొక్కేసిందనేది ఆరోపణ. ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉండొచ్చనేది టాక్.

Related Posts