YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పట్టు నిలుపుకున్న కాంగ్రెస్

పట్టు నిలుపుకున్న కాంగ్రెస్

మెదక్, డిసెంబర్ 15,
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఆది నుంచి అందరూ ఊహించిందే జరిగింది. కంచుకోటలో గులాబీ గుబాళించింది. టీఆర్ఎస్ పార్టీ నుండి బరిలో దిగిన వంటేరు యాదవరెడ్డి, సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 524 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ, రెండు గంటల్లోనే ముగిసింది. ఉదయం 10 గంటల్లోపు అభ్యర్థుల ఫలితాలు వెల్లడించి విజేతను ప్రకటించారు.మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థుల భవితవ్యం వెల్లడైంది. ఈ నెల 10 న నిర్వహించిన ఎన్నికల్లో 1026 మంది ఓటర్లకు గాను 1018 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 1018 ఓట్లలో 12 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. మిగిలిన ఓట్లను 25 చొప్పున బండిల్స్ కట్టి ఓట్లను లెక్కబెట్టి విజేతను ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి వంటేరు యాదవరెడ్డికి 762 ఓట్లు పోలయ్యాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు నిర్మల జగ్గారెడ్డికి 238 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి ఆరు ఓట్లు వచ్చాయి.మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన తూర్పు నిర్మల జగ్గారెడ్డి తన ఓటు బ్యాంకు కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యింది. సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోతాము గెలవకపోయినా, తమ పార్టీకి చెందిన 230 ఓట్లకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా తన పార్టీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. పోలింగ్ ముగిశాక కూడా అదే ధీమా వ్యక్తం చేశారు. చివరకు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 238 ఓట్లు పోలయ్యాయి. జగ్గారెడ్డి చేసిన సవాల్ కంటే 8 ఓట్లు ఎక్కువే నమోదయ్యాయి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 230 ఓట్లు ఉండగా మిగిలిన 8 ఓట్లు టీఆర్ఎస్ పార్టీ నుండి రాబట్టుకో కల్గింది. భారీగా క్రాస్ఓటింగ్ జరుగుతుందని భావించినప్పటికి ఎవరి ఓట్లు వారికి పడ్డాయని ఎన్నికల ఫలితాల బట్టి తెలుస్తోంది.

Related Posts