YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

జనం సోమ్ముతో జల్సా

జనం సోమ్ముతో జల్సా

శ్రీకాకుళం, డిసెంబర్ 15,
జనం సొమ్ము కాజేసి జల్సాలు చేయడం, గుట్టురట్టువగానే పరారవడం కామనైపోతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఓ పోస్టు మాస్టర్ ఏకంగా పదికోట్లకు పైగా నొక్కేశాడు. రెండు వేల మంది ఖాతాదారుల సొమ్మును కాజేశాడు. ఆముదాలవలస మండలం తోటాడ బ్రాంచ్‌లో బయటపడ్డ ఈ మోసం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా తోటాడ పోస్టు ఆఫీస్‌లో ఐదు గ్రామాల ప్రజలకు ఖాతాలున్నాయి. గోపీనగర్‌, అక్కివలస, మాసయ్యపేట, కొత్తరోడ్డు, తోటాడ గ్రామస్తులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మంత్లీ డిపాజిట్లు కట్టుకున్నారు. ఇటీవల పోస్టుమాస్టర్ శశిభూషణరావు మరణించడం, అతని కుటుంబం ఊరు నుంచి పరారవడంతో ఈ మోసం బయటపడింది. పోస్టుమాస్టర్ మృతి చెందడంతో పాటు తమ పోస్ట్ ఆఫీస్ బుక్ లో ఉన్న లావాదేవీలు ఆన్‌లైన్‌లో పొందుపరచకపోవడంతో ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులకు బిత్తరపోయే నిజాలు గుర్తించారు. దీంతో బాధితులు… పోస్టల్‌ అధికారులు, పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు తోటాడ పోస్టు ఆఫీస్‌లో తనిఖీలు నిర్వహించి… పది కోట్ల రూపాయలకు పైగా కాజేసినట్టు తేల్చారు. రాగోలు గ్రామంలోని శశిభూషణరావు ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. మరోవైపు పోస్ట్ మాస్టర్ నిర్వాకంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఎంతో నమ్మకంగా ఉండటంతో నగదును , చెల్లింపులు చేసామనీ, పోస్టుమాస్టర్ నమ్మకంతో మా గొంతులు కోసారని వాపోతున్నారు. పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఖాతాదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదిలావుంటే, ఈ పోస్ట్ ఆఫీస్ లో సుమారు 700 మంది ఖాతాదారులు ఉన్నట్లు వారి నుండి ఎంత మొత్తం ఎంత దారి మళ్లించారో పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తే గాని తెలియదని పోస్టల్ ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే గ్రామంలో పలువురు ఖాతాదారులు పుస్తకాలు డిపాజిట్ చేసిన పత్రాలను చూపడంతో భారీ స్థాయిలో పోస్ట్మాస్టర్ కుంభకోణానికి పాల్పడిన ట్లు గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts