గుంటూరు, డిసెంబర్ 15,
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల వాహనాలకు ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా డీజిల్ ను సరఫరా చేయాలని ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆర్టీసి బస్సులకు ఇస్తున్న డీజిల్ లో పెట్రోలియం సంస్థలు కొంత రాయితీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం లో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు ఆ డీజిల్ ను వాడాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రతి పాధనలు కూడా సిద్ధం చేసింది.అయితే డీజిల్ సరఫరా పై ఆర్టీసి మాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. చెల్లింపుల లో జాప్యం జరిగితే మళ్లీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆర్టీసి అభిప్రాయ పడుతోంది. కానీ ఆర్టీసి ద్వారా డీజిల్ సరఫరా జరిగితే రాయితీ కింద డబ్బులు మిగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ఆర్టీసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి