YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

స్టూడెంట్ కు షాక్ ఇచ్చిన సుష్మా

స్టూడెంట్ కు షాక్ ఇచ్చిన సుష్మా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. సాయం కోరిన వెంటనే స్పందించే అతి కొద్ది మంది నేతల్లో సుష్మా స్వరాజ్ ఒకరు. విదేశాంగ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఈమె ఫిలిప్ఫిన్స్‌లో ఉంటున్న ఓ కశ్మీరీ విద్యార్థికి తిక్క కుదిర్చే సమాధానం ఇచ్చారు. షేక్ అతీక్ అనే విద్యార్థి పాస్‌పోర్ట్ విషయమై సుష్మా స్వరాజ్‌ సాయం కోరుతూ ట్వీట్ చేశాడు. నేను జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చాను. ఫిలిప్ఫిన్స్‌లో మెడిసిన్ చదువుతున్నాను. నా పాస్‌పోర్ట్ దెబ్బతింది. దీంతో నెల క్రితం కొత్త దాని కోసం దరఖాస్తు చేశాను. మెడికల్ చెకప్ కోసం ఇంటికెళ్లాలి. కాబట్టి త్వరగా పాస్‌పోర్ట్ పొందేలా నాకు సాయం చేయండ’’ని అతీక్ ట్వీట్ చేశాడు. ఇక్కడి వరకూ బాగానే ఉందికానీ.. అతడి ట్విట్టర్ ప్రొఫైల్‌లో తన గురించి తాను ‘‘ఎంబీబీఎస్ స్టూడెంట్. ప్రౌడ్ టూ బీ ఆ ముస్లిం ఇండియన్ ఆక్యుపైడ్ కశ్మీర్’’ అని రాసుకున్నాడు.మంత్రి ట్వీట్ తర్వాత ఆ విద్యార్థి తన ప్రొఫైల్‌లో డిస్క్రిప్షన్ మార్చుకున్నాడు. ఆ విషయం గమనించిన సుష్మా స్వరాజ్ ‘‘నీ ప్రొఫైల్ సరి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. జయదీప్.. ఇతడు జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చిన ఇండియన్. అతడికి సాయం చేయమంటూ మనీలాలోని ఇండియన్ ఎంబసీని ఆదేశిస్తూ సుష్మా ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం అతడి ప్రొఫైల్ ట్విట్టర్లో కనిపించడం లేదు.

Related Posts