YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రోజాకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న నేతలు

రోజాకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న నేతలు

తిరుపతి, డిసెంబర్ 16,
సొంతపార్టీ ఎమ్మెల్యేపై వేర్వేరుగా కత్తులు దూస్తున్నవారు రూటు మార్చేశారు. వచ్చే ఎన్నికల్లో తమలో ఒకరు ఎమ్మెల్యే అని కొత్తపల్లవి అందుకున్నారట. వైరివర్గం వేస్తున్న ఈ ఎత్తుగడలు ఎమ్మెల్యే రోజాపై కావడంతో వైసీపీవర్గాల్లో ఒక్కటే చర్చ. రాష్ట్రస్థాయి గుర్తింపు ఉన్నా.. నగరి వైసీపీలో రోజాకు ఇంటిపోరు గట్టిగానే ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. వైసీపీ ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. స్థానికంగా సొంతపార్టీలో అసమ్మతి సెగలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు విపక్ష టీడీపీపై పోరాడుతూనే.. ఇంకోవైపు స్వపక్షంలోనే విపక్షంగా మారిన వారిపైనా మేడమ్‌ ఫైట్‌ చేయక తప్పడం లేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో అమ్ములు వర్గంతో.. పరిషత్‌ ఎన్నికల వేళ నగరి నేతలతో.. మున్సిపల్‌ ఎన్నికల వేళ  కుమార్‌ వర్గంతో రోజాకు తలపోట్లు తప్పలేదు. నామినేటెడ్‌ పదవుల పందేరంలోనూ అదే రగడ. చివరకు నగరిలో రోజా వర్సెస్‌ లోకల్‌ వైసీపీ లీడర్ల మధ్య గొడవలు డైలీ సీరియల్‌ మాదిరి చర్చకు దారితీస్తున్నాయి. ఇంటి పోరు నుంచి బయటపడేందుకు సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు ఎమ్మెల్యే రోజా తన బాధలు చెప్పుకున్నా ఫలితం దక్కలేదన్న చర్చ జరుగుతోంది. అయినప్పటికీ తనదైన శైలిలో పార్టీలోని ప్రత్యర్థివర్గానికి చుక్కలు చూపిస్తున్నారు ఈ ఫైర్‌బ్రాండ్‌. ఇక లాభం లేదనుకుందో ఏమో.. ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం కొత్తప్లాన్‌ అమలు చేస్తోంది. ఇన్నాళ్లూ స్థానిక వైసీపీ నేతలు వైరిపక్షంగా మారి రోజాపై ఎవరికి వారు పోరాటం చేసేవారు. ఆ వ్యతిరేకవర్గమంతా ఇప్పుడు ఒక్కటైంది. నగరిలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని.. ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా ఏం చేయాలో ప్రణాళిక వేసిందట.ఈ నెల 21న సీఎం జగన్‌ పుట్టినరోజు. ఆ రోజు చేపట్టే కార్యక్రమాలపై అసమ్మతివర్గం ఎమ్మెల్యే రోజాను కాదని.. వేరేగా సమావేశం పెట్టుకుంది. ఈ మీటింగ్‌కు పార్టీ నేత  కుమార్‌, ఈడిగ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌  శాంతి.. శ్రీశైలం ఆలయ ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ మురళీదర్‌రెడ్డి.. పుత్తూరు నుంచి అమ్ములు, విజయపురం నుంచి పార్టీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీపతిరాజు ఆ మీటింగ్‌కు వచ్చారట. సీఎం పుట్టినరోజు వేడుకలు తమ ఆధ్వర్యంలో వేరేగా నగరి లేదా పుత్తూరులో నిర్వహించాలని ఆ మీటింగ్‌లో నిర్ణయించారట.

Related Posts