తిరుపతి, డిసెంబర్ 16,
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు తన ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తాళ్లపాక నుంచి శేషాచలం అటవీ మార్గంలో వెళ్లిన కాలిబాట అభివృద్ధికి ఇన్నాళ్లకు అడుగులు పడ్డాయి. ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే రాయలసీమ జిల్లాలే కాకుండా దక్షిణ భారత యాత్రికులకు తిరుమల మరింత దగ్గర దారి అవుతుంది.
అన్నమయ్య కాలిబాట అందుబాటులోకి వస్తే తిరుపతి వెళ్లకుండానే నేరుగా తిరుమల కొండ ఎక్కవచ్చు. వైఎస్సార్ జిల్లా సరిహద్దులో ఉన్న కుక్కలదొడ్డి నుంచి రైల్వే ట్రాక్ దాటుకుని పశ్చిమ భాగంలోని శేషాచలం అటవీ మార్గంలో 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకోవచ్చు. దీనివల్ల 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనివల్ల తిరుమల వెళ్లే భక్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు ఆవశ్యకతను టీటీడీ బోర్డు గుర్తించింది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడిచి వెళ్లిన దారిని అభివృద్ధి చేయాలనే సంకల్పం తీసుకుంది. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయడంపై టీటీడీ బోర్డు దృష్టి సారించింది. ఆయన మరణానంతరం ఈ ప్రతిపాదన అటకెక్కింది. అప్పట్లో ఈ విషయాన్ని డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లిన సంగతి విదితమే. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో అన్నమయ్య కాలిబాటకు మోక్షం కలిగింది. గోవింద మాల ధరించే భక్తులు సుమారు 500 ఏళ్ల నుంచి అన్నమయ్య కాలిబాటలో స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు. ఓ వైపు పచ్చటి చెట్లు.. పక్షుల కిలకిలారావాలు.. జలజల పారే సెలయేర్లు.. ఎత్తయిన బండలు ఇలా ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నమయ్య కాలిబాట పయనం కొనసాగుతుంది. భక్తులు ఈ బాటలో కొండకు చేరుకుంటారు. ఈ మార్గంలో అనేక చోట్ల యాత్రికుల బసకు సంబంధించి సత్రాలు, అవ్వతాతల గుట్టలు, ఎర్రిగుంతలు, పార్వేటి మండపం, చావిళ్లు లాంటివి ఉన్నాయి
సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలకే వైరివర్గం పరిమితమైతే పార్టీలో పెద్దగా చర్చ జరిగేది కాదు. నియోజకవర్గంలో ఇకపై ఎవరికీ భయపడబోమని.. భవిష్యత్‌లో తమలో ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పి.. తమలోని అసంతృప్తినీ.. ఆగ్రహాన్ని బయటపెట్టారట. టీడీపీ నుంచి వచ్చినవారికి పదవులు అప్పగిస్తూ.. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారట. గతంలో చెప్పినట్టుగానే ఈసారి రోజా ఎమ్మెల్యేగా గెలుస్తారో చూస్తామని శ్రీశైలం ఆలయ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి శపథం చేశారట. రోజా వల్లే నగరిలో టీడీపీ గాలి వీస్తోందని మరో నేత కుమార్ ఫైర్ అయ్యారట.రోజా వ్యతిరేకవర్గమంతా ఇదే ఐక్యతతో సీఎం జగన్ దగ్గరకు వెళ్లితే పరిస్థితి ఏంటన్న చర్చ నగరి వైసీపీలో మొదలైందట. ఎక్కడా లేని విధంగా నగరి వైసీపీలో ఈస్థాయిలో వ్యతిరేక ఎందుకొచ్చిందో పార్టీ పెద్దలు గుర్తించాలని.. లేకపోతే పార్టీకి గుడ్‌బై చెబుతామని అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారట. వ్యతిరేకవర్గం మీటింగ్.. ఆ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు తెలుసుకున్న ఎమ్మెల్యే రోజావర్గం మాత్రం లైట్ తీసుకుందట. ఇదంతా జిల్లా పెద్దలు ఆడిస్తున్న డ్రామాగా కొట్టిపారేస్తున్నట్టు సమాచారం. మరి.. మారిన పరిణామాలతో నగరి వైసీపీలో ఏం జరుగుతుందో చూడాలి.