YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఈ నామ్ తో ఉల్లికి అధర హో

ఈ నామ్ తో ఉల్లికి అధర హో

కర్నూలు,డిసెంబర్ 16,
దేశంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉల్లిని ఈ-నామ్‌ పోర్టల్‌లో టెండరు ద్వారా కోనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉల్లి మార్కెట్‌లు ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌ మలక్‌పేటలో ఉల్లి మార్కెట్‌ నడుస్తోంది. ఎక్కడా కూడా ఈ-నామ్‌ అమలు కావడం లేదు. దేశంలో మొట్టమొదటి సారిగా ఉల్లిని ఈ-–నామ్‌లో కొనుగోలు చేస్తున్న ఏకైక మార్కెట్‌ కర్నూలు కావడం విశేషం.  ఈ-నామ్‌ అమలును మొదట్లో వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు వ్యతిరేకించారు. మార్కెట్‌ బంద్‌ చేసేంత వరకు పరిస్థితి వచ్చింది. అయితే దీని వల్ల ఎవ్వరికీ ఎటువంటి నష్టం ఉండబోదని మార్కెట్‌ కమిటీ అధికారులు అందరినీ ఒప్పించి ఆగస్టు 26వ తేదీన ఈ-నామ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రూ.22.16 కోట్ల విలువ చేసే 1.36 లక్షల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు. నాడు ఈ పద్ధతిని వ్యతిరేకించిన వారు నేడు జై కొడుతున్నారు.  కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గతంలో ఉల్లిని వేలంపాట ద్వారా కొనుగోలు చేసే వారు. ఈ సమయంలో వ్యాపారులు మంచి లాట్ల దగ్గర సిండికేట్‌ అయ్యేవారనే విమర్శలు ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్‌ అయి ధరలను అణచివేస్తున్నారని పలుసార్లు రైతులు రోడెక్కి ఆందోళనలు నిర్వహించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ–నామ్‌ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో ఆన్‌లైన్‌లో రహస్య టెండరు విధానంలో ధర కోట్‌ చేస్తారు. దీంతో వ్యాపారులు సిండికేట్‌ అయ్యే అవకాశం లేదు. ఫలితంగా ఉల్లికి మంచి ధర లభిస్తోంది.  దేశ వ్యాప్తంగా ఒకే మార్కెట్‌ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్‌ అమలు చేస్తోంది. జిల్లాలో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్‌ కమిటీల్లోనే వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవలి వరకు ఉల్లి మినహా అన్ని పంటలను ఈ-నామ్‌ పోర్టల్‌లోనే కొనుగోలు చేస్తూ వచ్చారు. ఉల్లిని కూడా ఈ విధానంలోకి తేవడంతో 100 శాతం ఈ-నామ్‌ను అమలు చేసినట్లు అయ్యింది.  

Related Posts