YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో రెడ్డి వర్సెస్ వెలమల పోరు

తెలంగాణలో రెడ్డి వర్సెస్ వెలమల పోరు

హైదరాబాద్, డిసెంబర్ 16,
మోడీ తొలిసారి ప్రధాన‌మంత్రి అయిన‌ప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌ట్టుకోసం బీజేపీ విశ్వప్రయ‌త్నాలు చేస్తోంది. ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి జెల్లకొట్టి సొంతంగా పోటీ చేసి ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్కచోట కూడా డిపాజిట్లు రాలేదు. ఇక తెలంగాణ‌లో మాత్రం లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విధంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటి నుంచి క్ర‌మ‌క్ర‌మంగా ప‌ట్టు సాధిస్తూ వ‌స్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యం, గ్రేట‌ర్‌లో కారును పంక్చర్ చేసే రేంజ్‌లో ఫ‌లితాలు సాధించిన క‌మ‌లం పార్టీ తర్వాత హూజూరాబాద్ లో విజయం సాధించింది. ఇక ఏపీలో ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంది. పేరుకు మాత్రమే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా జ‌న‌సేన‌ను పూర్తిగా ప‌క్కన పెట్టి బీజేపీ వ‌న్‌సైడ్‌గా రాజ‌కీయం చేస్తోంది. ఇది ప‌క్కన పెడితే వ‌చ్చే ఎన్నిక‌ల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న కుల రాజ‌కీయాల‌కు ధీటుగా, ఎవ్వరూ ఊహించ‌ని స్ట్రాట‌జీల‌తో ముందుకు వెళ్లేందుకు బీజేపీ చాప‌కింద నీరులా ప్లాన్ చేస్తోంద‌ని తెలిసింది. ఏపీలో రాజ‌కీయాల‌న్ని ప్రధానంగా క‌మ్మ, రెడ్డి వ‌ర్గాల మ‌ధ్యే తిరుగుతున్నాయి. కాపులు ఈ రెండు కులాల కన్నా మెజార్టీగా ఉన్నా వీరు ఎప్పుడూ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు.అందుకే బీజేపీ గ‌త మూడేళ్లుగా ఏపీలో కాపుల‌ను తెర‌మీద‌కు తెస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడిగా ప‌నిచేసిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు ఇద్దరూ కాపు వ‌ర్గం నేత‌లే. భ‌విష్యత్తులో ఏపీలో 20 శాతం పైగా ఉన్న కాపుల్లో ఐక్యత తీసుకు వ‌చ్చేందుకు కాపు వ‌ర్గానికి చెందిన వ్యక్తికే సీఎం పీఠం ఇస్తామ‌న్న ప్రక‌ట‌న బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం చేసేందుకు ప్లానింగ్ రెడీ అవుతోంది. సోము వీర్రాజు ఎప్పుడు అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యాడో అప్పటి నుంచి కాపులు క్రమ‌క్రమంగా సంఘ‌టితం అవుతున్నారు. బీజేపీ ప్లాన్ బాగానే ఉన్నా రాజ్యధికారం రావాలంటే బీసీ, ఎస్సీల మ‌ద్దతు త‌ప్పనిస‌రి.. మ‌రి ఆ దిశ‌గా కాపులు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతార‌న్నది మాత్రం చూడాలి.ఇక స‌మైక్య పాల‌న మిన‌హాయిస్తే తెలంగాణ‌లో ప్రస్తుతం రాజ్యాధికారం కోసం రెడ్డి వ‌ర్సెస్ వెల‌మ‌ల మ‌ధ్య పోరు న‌డుస్తోంది. కేసీఆర్ ఏక‌చ‌క్రాధిప‌త్యంతో విసిగిపోతోన్న రెడ్లు ఏం చేయాలా ? అని కాచుకుని ఉన్నారు. ఈ రెండు అగ్రకులాలు అధికారంలోకి రావాలంటే ఖ‌చ్చితంగా బీసీల మ‌ద్దతు ఉండాలి. తెలంగాణ‌లో టీడీపీ బీసీల మ‌ద్దతుతోనే రెడ్లను ఎదిరించి పాగా వేసింది. ఇప్పుడు బీజేపీ ఇక్కడ బీసీ సీఎం నినాదాన్ని బ‌లంగా ఎత్తుకునేలా బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఇప్పటికే స్కెచ్ గీసిందంటున్నారు.తెలంగాణ‌లో చాప‌కింద నీరులా దూసుకుపోతోన్న బీజేపీలో ఎదుగుతోన్న నాయ‌కుల్లో ఎక్కువ మంది బీసీ నేత‌లే ఉన్నారు. ఆ మాట‌కు వ‌స్తే తెలంగాణ రాజ‌కీయాల్లో గ‌త కొద్ది సంవ‌త్సరాలుగా అన్ని పార్టీల్లోనూ బీసీలు ప్రబ‌ల‌శ‌క్తిగా ఎదుగుతున్నారు. అందుకే ఈ సారి ఏపీలో కాపుల‌ను సంఘ‌టితం చేసిన‌ట్టే ఇక్కడ బీసీల‌ను ఏకతాటిమీద‌కు తీసుకురావాల‌ని బీజేపీ అధిష్టానం స్కెచ్ వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ సీఎం అభ్యర్థి ఖ‌చ్చితంగా బీసీ అభ్యర్థే కానున్నారని తెలిసింది. ఇప్పటికే అక్కడ కాపులు  బీజేపీలో కీల‌కంగా ఉన్నారు. వీరికి తోడు బీసీల‌ను జ‌త‌చేస్తే కేసీఆర్‌కు పూర్తిగా చెక్ పెట్టవ‌చ్చన్నదే బీజేపీ ప్లాన్‌. మ‌రి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎత్తులు, స్కెచ్‌లు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ? చూడాలి.

Related Posts