YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

శివార్లలో డ్రగ్స్ దందా

శివార్లలో డ్రగ్స్ దందా

హైదరాబాద్, డిసెంబర్ 16,
 స్టూడెంట్స్ ను టార్గెట్గా చేసుకుని కొంతమంది డ్రగ్స్ వ్యాపారులు దందా చేస్తున్నారు. నగర శివార్లలో చాలా కాలేజ్ లు ఉండడంతో జోరుగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇటీవల నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్న వాళ్లు, వాడుతున్న స్టూడెంట్స్ పోలీసులకు దొరుకుతున్నారు. ఇది నార్కోటిక్స్ అధికారులు, పోలీసులను కూడా కలవరపెడుతుంది.  ఒకప్పుడు ముంబై, గోవా ల నుంచి డ్రగ్స్ ను ఇక్కడికి సప్లయ్ చేసేవారు. కానీ ఇప్పుడు జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా,  కొన్ని నివాస ప్రాంతాల్లోనే డ్రగ్స్ ను  భారీగా తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన డ్రగ్స్ ను అమ్మేందుకు స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తున్నారు. ముందు తక్కువ ధరకే అంటూ వారికి డ్రగ్స్ ను అలవాటు చేస్తున్నారు. వారే కాకుండా తమ ఫ్రెండ్స్ కు కూడా డ్రగ్స్ అలవాటు చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జీడిమెట్లలో శుక్రవారం నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ తయారీ చేస్తున్న ల్యాబ్ ను గుర్తించడం కలకలం రేపింది. ఓ సప్లయ్ దారుడిపై నిఘా పెట్టిన అధికారులు అతను డ్రగ్స్ ఎక్కడ తెస్తున్నాడో ఫాలో చేశారు. దీంతో డ్రగ్స్ తయారు చేస్తున్న ల్యాబ్ బయట పడింది. విచారణలో ఏడాది కాలంలోనే 100 కిలోల డ్రగ్స్ ను ఇక్కడి నుంచి సప్లయ్చేశారని తెలుసుకొని నార్కోటిక్స్ అధికారులు షాక్ అయ్యారు. ఇంకా ఎంతో మంది ఇలా ల్యాబ్ ల్లో డ్రగ్స్ తయారు చేసి దందా చేస్తున్నారని అనుమానిస్తున్నారు.కొంతమంది వ్యక్తులు స్టూడెంట్స్ జీవితాలు ఏమై పోయినా  పర్వాలేదనుకొని అడ్డదారుల్లో డబ్బు సంపాదించేందుకే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గ్రామ్ డ్రగ్స్ కే వేలల్లో ధర ఉండడంతో కొంతమంది కెమికల్ ఇంజనీర్లు ఇటువైపు వస్తున్నారు. వాళ్లకున్న నాలెడ్జ్ తో డ్రగ్స్ తయారు చేసి సప్లయ్ దారులకు అందజేస్తున్నారు. శుక్రవారం డీఆర్ఐ అధికారులు అరెస్టు చేసిన వేగి శ్రీనివాస్రావుది అదే తీరు.  కెమిస్ట్రీలో పీహెచ్ డీ చేసి ప్రముఖ బయోటెక్ కంపెనీలో మంచి జాబ్లో ఉన్నప్పటికీ తక్కువ టైంలోనే కోటీశ్వరుడు అవ్వాలన్న అత్యాశతో డ్రగ్స్ దందా ఎంచుకున్నాడు. డ్రగ్ తయారీ ముఠా నార్కోటిక్  డ్రగ్స్ తయారు చేసేందుకు ఎక్కువ గా నష్టాల్లో ఉన్న ఫార్మా కంపెనీలను లీజుకు తీసుకొని ఈ దందా చేస్తున్నాయి.

Related Posts