YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

ధర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సర్కార్ సిద్ధం

ధర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సర్కార్ సిద్ధం

వరంగల్, డిసెంబర్ 16,
ప్రభుత్వ ఆదేశాలతో కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం. ఎంజీఎం దవాఖాన లో వైద్య సేవలను మరింత విస్తృతం చేశాం. గతంలో ఇక్కడ 800 బెడ్స్‌కు మాత్రమే ఆక్సిజన్‌ వసతి ఉండేది. ఇప్పుడు ప్రతి బెడ్‌కు ఆక్సిజన్‌ ఏర్పాటు చేశాం. మొత్తం 1,070 పడకలకు ఈ సౌకర్యం ఉంది. థర్డ్‌వేవ్‌ బారిన పడే చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా పీడియాట్రిక్‌ విభాగాన్ని పటిష్టం చేశాం. ప్రస్తుతం ఈ విభాగంలో ఐసీయూ బెడ్స్‌ సహా మొత్తం 150 వరకు ఉ న్నాయి. వీటికి అదనంగా మరో 42 బెడ్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. వైద్యులు, సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. కొత్తగా మరో 29 మంది వైద్యులు వచ్చారు. సూపర్‌ స్పెషాలిటీలోని ప్రతి విభాగంలో ఇద్దరు నుంచి నలుగురు వైద్యులను తీసుకున్నాం. రూ.1,100కోట్ల అంచనా వ్యయంతో వరంగల్‌లో రెండు వేల పడకల సామర్థ్యంతో 24 అంతస్తుల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించ డం మెడికల్‌ చరిత్రలోనే మొదటిది. ఇది వరంగల్‌ ప్ర జల అదృష్టమని వరంగల్‌ ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్‌ బత్తుల శ్రీనివాసరావు అన్నారు.కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలో పూర్తిగా ప్రభుత్వ ద వాఖానల్లోనే ప్రజలకు వైద్యం లభించింది. వరంగల్‌ ఎంజీఎంలోనే కరోనా పేషెంట్లకు వైద్య సేవలందిం చాం. 250 బెడ్స్‌తో ప్రత్యేకంగా కరోనా వార్డు ఏర్పా టు చేశాం. వివిధ జిల్లాల నుంచి కరోనా పేషెంట్లు ఇక్కడికే వచ్చారు. ప్రైవేటు దవాఖానల్లో ఎక్కడా కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్‌ చేయలేదు. సెకండ్‌వేవ్‌ టైంలో కరోనా పేషెంట్లను చేర్చుకున్న ప్రైవేటు దవాఖానల ని ర్వాహకులు చివరకు ఆక్సిజన్‌ కొరత, ఇతర కారణాల వల్ల ఇక్కడికే పంపారు. ప్రైవేటు దవాఖానల్లో ఎంతయినా ఆక్సిజన్‌ నిల్వలు తక్కువే. చివరి స్టేజీలో ఎంజీ ఎం దవాఖానకు వచ్చిన కరోనా పేషెంట్లకూ వైద్య సేవలందాయి. కరోనా వార్డులోని 250 బెడ్సే కాకుండా ఇతర విభాగాల్లోని మరో 550 బెడ్స్‌ మొత్తం 800 బెడ్స్‌కు ఆక్సిజన్‌ వసతి కల్పించాం. ఎంజీఎం దవాఖానలో మొత్తం పడకల సంఖ్య 1,070. థర్డ్‌ వేవ్‌ దృష్ట్యా ప్రతి బెడ్‌కు ఉండాలనే లక్ష్యంతో 1,070 బెడ్స్‌కు ఆక్సిజన్‌ సౌకర్యం ఏర్పాటు చేశాం.ఇపుడు థర్డ్‌ వేవ్‌ కొత్త చాలెంజ్‌. చిన్న పిల్లలపై ప్రభా వం ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంజీ ఎం దవాఖానలోని పీడియాట్రిక్‌ విభాగాన్ని పటిష్టం చేశాం. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రెడీ చేశాం. ఏది ఏమైనా చిన్న పిల్లలకు ప్రభుత్వ దవాఖానల్లోనే ట్రీట్‌మెంట్‌ జరుగాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వింగ్‌లో ఇప్పుడు 90 బెడ్స్‌ ఉన్నాయి. ఐసీయూ బెడ్స్‌ మరో 150 వరకు ఉన్నాయి. థర్డ్‌ వేవ్‌ దృష్ట్యా అదనంగా 42 బెడ్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం కూడా పీడియాట్రిక్‌ వింగ్‌లో వసతుల కల్పన కోసం రూ.2.50 కోట్లు సాంక్షన్‌ చేసింది.ఎంజీఎం దవాఖానలోని అన్ని విభాగాల్లో ప్రజలకు వైద్య సేవలు పెరిగాయి. కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా వైద్యులు, సిబ్బంది నియామకం జరిగింది. గ తంలో వంద మందికిపైగా వైద్యులు ఉంటే వీరికి తోడు ఇప్పుడు మరో 29 మంది వైద్యులు నూతనంగా వచ్చా రు. కేఎంసీ వైద్యులు కూడా సేవలందిస్తున్నారు. ప్రస్తు తం ఇక్కడ వైద్యులు, సిబ్బంది కొరతను అధిగమిం చాం. సూపర్‌ స్పెషాలిటీలోని ప్రతి వింగ్‌లో ఇద్దరు నుంచి నలుగురు డాక్టర్లను తీసుకున్నం. ఓపీ సేవలనూ మెరుగుపరిచాం. మామూలు, కరోనా వైద్య సేవలు ఏ కకాలంలో అందిస్తాం. ఆక్సిజన్‌ కొరత తలెత్తకపోవ చ్చు. ప్రస్తుతం రెండు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. వాతావరణం నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్లను కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్‌గా గతంలో నేను సమర్థవంతంగా సేవలందించా. ఫస్ట్‌ వేవ్‌ సమయంలో ప్రైవేట్‌ దవాఖానల వారెవరూ కరోనా పేషెంట్లను తీసుకోలేదు. ఎంజీఎం దవాఖాన కరోనా వైద్యానికి ప్రథమ కేంద్రం. ఇక్కడకు బయటి జిల్లాల నుంచి కూడా కరోనా పేషెంట్లు వచ్చారు. కేఎంసీలో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశాం. ఆ సమయంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించా. 2020 జూలైలో నాకు, నా కుటుంబ సభ్యులకు ఏకకాలంలో కరోనా సోకింది. తాత్కాలిక విరామం కావాలని కోరాను. ప్రభుత్వ అనుమతితో ఆగస్టు 5న రిలీవ్‌ అయ్యాను. తర్వాత పదిపన్నెండు రోజులకు అనస్తీషియా హెచ్‌వోడీగా జాయినయ్యాను. కరోనా పేషెంట్లకు సేవలందించడంలో ముందు నిలిచాను. నాకు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ లేదు. నిజాయితీగా పనిచేస్తా. రెగ్యులర్‌ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ప్రభుత్వం సీనియారిటీ లిస్టు ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 31 మందికి అడిషనల్‌ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. ఈ పదోన్నతి లిస్టులో నాది 13వ పేరు. స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండడం వల్ల ప్రభుత్వం నన్ను ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్‌గా నియమించిందిరెండు వేల పడకల కెపాసిటీ, 24 అంతస్తులతో ఇక్కడ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను ప్రభుత్వం నిర్మించ తలపెట్టడం వరంగల్‌ ప్రజల అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఒక హాస్పిటల్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1,100 కోట్లు సాంక్షన్‌ చేయడం అనేది దేశంలో వైద్య చరిత్రలోనే తొలిసారి. ఎయిమ్స్‌ కూడా ఇప్పటివరకు ఇంత పెద్ద అమౌంట్‌ ఒక దవాఖాన కోసం ఇవ్వలేదు. రూ.1,100 కోట్లతో పాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసే దిశలో ముందుకు వెళ్తున్నది. వచ్చే జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభం కావాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది.

Related Posts