YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మహిళల నిధులు తీసుకోవడం అన్యాయం

మహిళల నిధులు తీసుకోవడం అన్యాయం

విశాఖపట్నం
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఫైర్అయ్యారు.వైఎస్సార్ అభయ హస్తం పేరుతో మహిళలు ఎల్ఐసీకి చెల్లిస్తున్న రెండు వేల కోట్లు ప్రభుత్వం తీసుకోవడం అన్యాయమని మండిపడ్డారు.వృద్ధా ప్య సమయంలో మహిళలను ఆదు కోవడమే వైఎస్సార్ అభయ హస్తం పథకం ముఖ్య ఉద్దేశమని.. అలాంటి ది మహిళల ప్రమేయం లేకుండా వారి నిధులను ప్రభుత్వం తీసుకోవడం చట్ట రీత్యా నేరమని అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మహి ళలందరూ వ్యతిరేకించాలని కోరారు. అదేవిధంగా విద్యార్థులకు మంచి మె నూ ఇస్తున్నట్లు ప్రకటించడమే తప్ప.. వాటి బిల్లులు ఆరునెలల నుంచి చెల్లిం చడం లేదని ఆరోపించారు.ప్రతి నెలా ఒకటో తేదీ వస్తుందంటే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన అన్నారు.ప్రభుత్వానికి అప్పు ల కోసం వెతుకులాట తప్పడం లేద న్నారు. ఇందులోభాగంగా పుట్టుకొచ్చిం దే ఓటీఎస్ అని..30 ఏళ్ల నాటి ఇళ్లకు ఇప్పుడు చెల్లింపులు ఏంటి..? రిజిస్ట్రే షన్లు ఏంటి..? అని ప్రశ్నించారు.ఇదం తా వట్టి బూటకమని.. కేవలం నిధుల కోసమే ఈ తాపత్రయమంతా అని అన్నారు. ఓటీఎస్ పథకానికి ఎవరూ చెల్లింపులు చేయొద్దని సూచించారు. ఎప్పుడో పెళ్లి అయిన వారికి మళ్లీ పెళ్లి చేయడం ఏంటి..? చాలా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

Related Posts