న్యూఢిల్లీ : తెలంగాణ లోని నాలుగు బొగ్గు గనులను సింగరేణికే అప్పగించాలి బొగ్గు గనుల ప్రైవేటీకరణ పై కార్మిక సంఘాల మండిపాటు కేంద్ర పెద్దలను కలిసిన బీఎంఎస్ నేతలు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీకి 'కోల్ మైన్స్ కార్మిక సంఘ్' వినతి.
కేంద్ర ప్రభుత్వం వేలానికి సిద్ధం చేసిన నాలుగు బొగ్గు గనులను ఆ ప్రక్రియ నుంచి తొలగించి సింగరేణికి అప్పగించాలని బీఎంఎస్ అనుబంధ సంస్థ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి విజ్ఞప్తిచేసింది. బీఎంఎస్ జాతీయ నాయకుడు కె. లక్ష్మా రెడ్డి, కార్మికసంఘ్ ప్రధాన కార్యదర్శి పి. మాధవ్ నాయక్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అందుకు ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎంగానీ, సింగరేణి సీ అండ్ ఎండీకానీ వ్యక్తిగతంగా సమస్యను కేంద్రం దృష్టికి తేవడంలో విఫలమయ్యారని ప్రహ్లాద్ జోషి తమతో అన్నట్లు చెప్పారు....